NTV Telugu Site icon

Today (27-01-23) Business Headlines: దేశంలో 99 శాతం ఇళ్లకు బ్యాంకింగ్ సేవలు. మరిన్ని వార్తలు.

Today (27 10 23) Business Headlines

Today (27 10 23) Business Headlines

Today (27-01-23) Business Headlines

సీఈఓగా తప్పుకోనున్న టయోడా

జపాన్ కార్ల తయారీ సంస్థ టయోటా మోటార్ కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు అధ్యక్షుడు అకియో టయోడా ఈ పదవుల నుంచి తప్పుకోనున్నారు. ఇక మీదట ఆయన సంస్థ చైర్మన్’గా మాత్రమే కొనసాగనున్నారు. అకియో టయోడా స్థానంలో కోజి సాటో CEOగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈయన ప్రస్తుతం టయోటా కంపెనీ చీఫ్ బ్రాండింగ్ ఆఫీసర్’గా చేస్తున్నారు.

115% పెరిగిన ‘రియల్’ పెట్టుబడులు

మన దేశంలోని రియల్ ఎస్టేట్ రంగంలోకి గతంలో ఎన్నడూ లేని విధంగా పెట్టుబడులు వచ్చాయి. డిసెంబర్ త్రైమాసికంలో ఇవి 64 శాతం వృద్ధి చెందగా 2021తో పోల్చితే ఏకంగా 115 శాతం పెరగటం విశేషం. తద్వారా లైఫ్ టైమ్ హయ్యస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ నమోదయ్యాయి. ఈ విషయాలను VBRE సంస్థ దక్షిణాసియా విభాగం వెల్లడించింది. ఈ మేరకు ‘ఇండియా మార్కెట్ మానిటర్ 2022’ పేరుతో నివేదిక విడుదల చేసింది.

4 లక్షలకు పైగా ‘మారుతీ’ పెండింగ్

మారుతీ సుజుకీ ఇండియా సంస్థకు ఆర్డర్లు అంతకంతకూ పెరుగుతున్నాయి. దీంతో.. డెలివరీ చేయాల్సిన పెండింగ్ ఆర్డర్ల సంఖ్య 4 లక్షలకు పైగా చేరుకుంది. 2022 డిసెంబర్ నాటికి పెండింగ్ ఆర్డర్ల సంఖ్య 3 పాయింట్ ఆరు మూడు లక్షలు ఉండగా కొత్తగా విడుదల చేసిన స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ వల్ల ఆర్డర్ల సంఖ్య వృద్ధి చెందింది. కొత్త మోడళ్లు SUV జిమ్నీకి 11 వేలు, ఫ్రోంక్స్’కు 4 వేల ఆర్డర్లు వచ్చాయని సంస్థ ప్రతినిధి తెలిపారు.

‘బడ్జెట్’ హల్వా వేడక పున:ప్రారంభం

కేంద్ర బడ్జెట్ రూపకల్పనకు ముందు ఆనవాయితీ ప్రకారం నిర్వహించే హల్వా వేడుక ఈ ఏడాది తిరిగి ప్రారంభమైంది. గతేడాది కరోనా కారణంగా ఈ కార్యక్రమం జరగలేదు. దీనికి బదులుగా స్వీట్లు మాత్రమే పంచి ‘మమ’ అనిపించారు. ఈసారి మాత్రం హల్వా వండి వడ్డించారు. తద్వారా ఆర్థిక శాఖ అధికారులకు, సిబ్బందికి నోరు తీపి చేశారు. నార్త్ బ్లాక్’లోని బేస్’మెంట్’లో జరిగిన ఈ ప్రోగ్రామ్’లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు.

జీటీఎల్ డైరెక్టర్లపై సీబీఐ కేసు

టెలికం రంగంలో మౌలిక వసతుల సేవలు అందించే GTL లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ల మీద CBI కేసు నమోదైంది. లోన్ డబ్బును దారిమళ్లించారనే ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. IDBI బ్యాంక్ ఆధ్వర్యంలోని 24 బ్యాంకుల కన్సార్షియం నుంచి 4 వేల 760 కోట్ల రూపాయలు రుణం పొందగా అందులో మెజారిటీ షేరును పక్కదోవ పట్టించారని ఆరోపణలు వచ్చాయి. ఈ మోసపూరిత వ్యవహారాల కోసం GTLకి అనుకూలంగా వివిధ సంస్థలను ఏర్పాటుచేసినట్లు 2011లోనే గుర్తించారు.

99% ఇళ్లకు బ్యాంకింగ్ సేవలు

దేశంలోని 99 శాతం గృహాలకు బ్యాంకింగ్ సేవలు అందుతున్నట్లు వెల్లడైంది. పీపుల్ రీసెర్చ్ ఆన్ ఇండియాస్ కన్జ్యూమర్ ఎకానమీ.. PRICE.. అనే సంస్థ తన సర్వే నివేదికలో ఈ విషయాన్ని పేర్కొంది. 2011-2021 మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాల అమలు తీరుపై ఈ సంస్థ అధ్యయనం నిర్వహించింది. మొబైల్ ఫోన్లు వాడే వారి సంఖ్య భారీగా పెరిగిందని, అదే సమయంలో ఆ ఫోన్లకు బ్యాంకింగ్ సర్వీసుల యాక్సెస్ కూడా పెరిగిందని పేర్కొంది. ఈ రెండు అంశాల్లోనూ దాదాపు ఫార్టీ పర్సంటేజ్ పాయింట్ల చొప్పున గ్రోత్ నెలకొన్నట్లు గుర్తించింది.