Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Today 23 12 22 Business Headlines Local To Global Financial News

Today (23-12-22) Business Headlines: ‘చిత్ర’కు బెయిలు.. అయినా జైలు. మరిన్ని ముఖ్య వార్తలు..

Published Date :December 23, 2022 , 11:35 am
By Akkirala Kondala Rao
Today (23-12-22) Business Headlines: ‘చిత్ర’కు బెయిలు.. అయినా జైలు. మరిన్ని ముఖ్య వార్తలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Today (23-12-22) Business Headlines:

ఎయిర్‌టెల్‌-అపోలో దోస్తీ: ఆరోగ్య సంరక్షణ రంగంలో అధునాతన 5జీ టెక్నాలజీని వాడుకోవటానికి ఎయిర్‌టెల్‌ మరియు అపోలో హాస్పిటల్స్‌ ఒప్పందం కుదుర్చుకున్నాయి. 5జీ టెక్నాలజీతోపాటు ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ను కూడా వినియోగించుకున్నాయి. హెల్త్‌నెట్‌ గ్లోబల్‌, ఏడబ్ల్యూఎస్‌ మరియు అవేషా అనే సంస్థలను కూడా కలుపుకొని కలనోస్కోపీ ట్రయల్స్‌ నిర్వహించాయి. కలనోస్కోపీ ట్రయల్స్‌.. అంటే.. పెద్ద పేగు పరిశీలనకు సంబంధించిన పరీక్షలను చేపట్టాయి. ఈ హెల్త్‌ టెస్టుల్లో పెద్ద పేగు క్యాన్సర్‌ను చాలా తొందరగా, సుస్పష్టంగా గుర్తించాయి.

‘చిత్ర’కు బెయిలు.. అయినా జైలు..

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌ మాజీ డైరెక్టర్‌ అండ్‌ సీఈఓ చిత్రా రామకృష్ణకు కాస్త ఊరట లభించింది. కానీ.. ఒక కేసులో బెయిల్‌ లభించినప్పటికీ మరో కేసుకు సంబంధించి కోర్ట్‌ ఆర్డర్‌ రాకపోవటంతో ఆమె ప్రస్తుతానికి జైల్లోనే కొనసాగాల్సి వస్తోంది. ఎన్‌ఎస్‌ఈ ఉద్యోగుల ఫోన్లను ట్యాప్‌ చేశారనే కేసులో చిత్రా రామకృష్ణకు ఢిల్లీ హైకోర్టు బెయిల్‌ ఇచ్చింది. లక్ష రూపాయల పర్సనల్‌ బాండ్‌ పేపర్‌తోపాటు ఇద్దరి ష్యూరిటీలను కూడా ఇవ్వాలని ఆదేశించింది. కేసు విచారణకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని, న్యాయస్థానానికి తెలియకుండా విదేశాలకు వెళ్లొద్దని షరతులు విధించింది.

‘ఇండియా సిమెంట్స్‌’పై సీసీ‘ఐ’

ఇండియా సిమెంట్స్‌కు చెందిన చెన్నై ఆఫీసులో కాంపిటిషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా సోదాలు నిర్వహించింది. ఈ విషయాన్ని ఇండియా సిమెంట్స్‌ లిమిటెడ్‌ వెల్లడించింది. సీసీఐ నిబంధనలను తాము ఉల్లంఘించలేదని పేర్కొంది. ఈ ఆకస్మిక దాడికి సంబంధించి వస్తున్న వార్తలపై బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ స్పష్టత కోరగా ఐసీఎల్‌ వివరణ ఇచ్చింది. సీసీఐ అధికారులు నిన్న గురువారం ఉదయం పదకొండున్నరకు తమ కార్యాలయానికి వచ్చారని, అక్రమాలు ఏమైనా జరుగుతున్నాయా అనే కోణంలో తనిఖీలు చేపట్టారని తెలిపింది. తాము ఏ తప్పూచేయనందున ఈ పరిణామం తమపై ఎలాంటి ప్రభావమూ చూపబోదని ఐసీఎల్‌ ధీమా వ్యక్తం చేసింది.

రూ.1158 లక్షల కోట్ల నష్టం

ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్‌ వరకు ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లలో ఇన్వెస్టర్లకు భారీ నష్టం వాటిల్లింది. 11 నెలల్లో జరిగిన ఈ నష్టం విలువ 11 వందల 58 లక్షల కోట్ల రూపాయలు. అగ్రరాజ్యం అమెరికాతోపాటు అత్యంత సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే జర్మనీ గవర్నమెంట్‌ లోన్‌ డాక్యుమెంట్స్‌ కూడా 16 నుంచి 24 శాతం వరకు నష్టాలను మిగిల్చాయి. దీనికి ఇప్పుడు కరోనా కేసుల భయాలు కూడా తోడు కావటం గమనించాల్సిన విషయం. ఈ నేపథ్యంలో డిసెంబర్‌లోని నష్టాలను కూడా కలిపితే 2022 మొత్తమ్మీద నికర నష్టం ఇంకెంత తేలుతుందో చూడాలి.

పరుపుల మార్కెట్‌లో గ్రోత్‌

మన దేశంలో ఇటీవల కొన్నేళ్లుగా ఖరీదైన పరుపులకు డిమాండ్‌ బాగా నెలకొంటోంది. మామూలు పరుపుల మార్కెట్‌లో ఆరేడు శాతం గ్రోతే ఉండగా ప్రీమియం మ్యాట్రెసెస్‌ మార్కెట్‌లో మాత్రం ఏకంగా 20 నుంచి 25 శాతం వృద్ధి చోటుచేసుకుంటోంది. ఈ విషయాన్ని పాలీఫ్లెక్స్‌ అనే ఇటలీ సంస్థ ఇండియా ఎండీ ఆనంద్‌ నిచాణి చెప్పారు. ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా సుమారు వంద దేశాల్లో పరుపుల వ్యాపారం చేస్తోంది. మ్యాగ్నీఫ్లేక్స్‌ అనే బ్రాండ్‌ నేమ్‌తో కాస్ట్‌లీ మ్యాట్రెసెస్‌ను విక్రయిస్తోంది. ఈ పరుపుల కనీస ధర 85 వేల రూపాయలు. పాలీఫ్లెక్స్‌కి మన దేశంలో 63 స్టోర్లు ఉన్నాయి. ఏడాదిన్నరలో 116కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఎల్‌జీ న్యూఇయర్‌ ఆఫర్లు

నూతన సంవత్సరం 2023 సమీపిస్తున్న నేపథ్యంలో ఎల్‌జీ సంస్థ ఆకట్టుకునే ఆఫర్లు ప్రకటించింది. హౌజ్‌ హోల్డ్‌ అండ్‌ ఎంటర్టైన్‌మెంట్‌ ప్రొడక్టులను కొన్నవారికి 20 శాతం వరకు క్యాష్‌ బ్యాక్‌ ఇవ్వనుంది. కస్టమర్‌పై నెలవారీ ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు ఫిక్స్‌డ్‌ ఈఎంఐని తక్కువగానే.. అంటే.. 999 రూపాయల నుంచే ప్రారంభించింది. దీనికితోడు జీరో డౌన్‌ పేమెంట్ సౌకర్యాన్ని కూడా కల్పి్స్తోంది. ఇవే కాకుండా.. ప్రత్యేక రాయితీలు మరియు కంపల్సరీ గిఫ్టులతో కూడిన ఈ ఆఫర్లను ‘న్యూ సీజన్‌ సెలబ్రేషన్‌’ పేరుతో ప్రారంభించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • airtel-apollo
  • chitra ramakrishna
  • competition commission of india
  • daily business highlights
  • india cements

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions