Today (23-02-23) Stock Market Roundup: ఇండియన్ ఈక్విటీ మార్కెట్ ఇవాళ గురువారం కూడా నష్టాల్లోనే ముగిసింది. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన రెండు కీలక సూచీలు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. సాయంత్రం వరకు లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నెలవారీ ముగింపునకు వస్తుండటం దీనికి ప్రధాన కారణంగా నిలిచింది. ఇదిలాఉండగా.. ఎఫ్‌ఎంసీజీ, మెటల్ మరియు ఐటీ షేర్లు రాణించి బెంచ్‌మార్క్‌లను దాటడం చెప్పుకోదగ్గ అంశం.
అయితే.. చివరికి.. సెన్సెక్స్ 139 పాయింట్లు కోల్పోయి 59 వేల 605 పాయింట్ల వద్ద ఎండ్ అయింది. నిఫ్టీ.. 43 పాయింట్లు తగ్గి.. 17 వేల 511 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్‌లోని మొత్తం 30 కంపెనీల్లో 13 కంపెనీలు మంచి పనితీరు కనబరచగా మిగిలిన 17 సంస్థలు నష్టాల బాటలో నడిచాయి.
read more: Google and Twitter: గూగుల్, ట్విట్టర్ తాజా నిర్ణయాలు
బీఎస్‌ఈలో యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐఎన్, టాటా మోటార్స్, టాటా స్టీల్ తదితర కంపెనీలు రాణించాయి. రంగాల వారీగా చూసుకుంటే.. నిఫ్టీ మీడియా ఇండెక్స్ రెండు శాతం దిగొచ్చింది. వ్యక్తిగత స్టాక్స్‌ను పరిశీలిస్తే.. జీ ఎంటర్టైన్‌మెంట్ షేర్ల విలువ 14 శాతం క్షీణించింది. తద్వారా 52 వారాల కనిష్టానికి పతనమైంది. 10 గ్రాముల బంగారం ధర 254 రూపాయలు తగ్గింది.
అత్యధికంగా 55 వేల 829 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి రేటు 501 రూపాయలు పడిపోయింది. గరిష్టంగా 64 వేల 937 రూపాయలు పలికింది. క్రూడాయిల్ ధర స్వల్పంగా 16 రూపాయలు తగ్గింది. ఒక బ్యారెల్ ముడి చమురు 6 వేల 158 రూపాయలు నమోదైంది. రూపాయి వ్యాల్యూ 17 పైసలు బలపడింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 74 పైసల వద్ద స్థిరపడింది.
