NTV Telugu Site icon

Today (12-01-23) Stock Market Roundup: వరుసగా మూడో రోజూ కనిపించని సెంటిమెంట్‌

Today (12 01 23) Stock Market Roundup

Today (12 01 23) Stock Market Roundup

Today (12-01-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా మూడో రోజూ సెంటిమెంట్‌ కరువై నష్టాలతోనే ముగిసింది. ఇవాళ గురువారం ఉదయం రెండు కీలక సూచీలు కూడా మందకొడిగానే ట్రేడింగ్ ప్రారంభించినప్పటికీ కొద్దిసేపటికి స్వల్ప లాభాల్లోకి వచ్చాయి. కానీ.. ఇంట్రాడేలో నెగెటివ్ జోన్‌లో కదలాడాయి. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడి కానుండటం మరియు క్రూడాయిల్‌ ధరలు పెరుగుతుండటంతో ఆ ప్రభావాలు స్టాక్‌ మార్కెట్‌పై స్పష్టంగా కనిపించాయి.

దీంతో సెన్సెక్స్ మరియు నిఫ్టీ తమ బెంచ్ మార్క్‌ను బ్రేక్‌ చేసి దిగువన సెటిల్‌ అయ్యాయి. సెన్సెక్స్‌ 147 పాయింట్లు తగ్గి 59 వేల 958 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 37 పాయింట్లు పడిపోయి 18 వేల 858 పాయింట్ల వద్ద క్లోజ్‌ అయింది. సెన్సెక్స్‌లో రిలయెన్స్‌ షేర్లు 2 శాతం వెనకబడ్డాయి. బ్యాంక్‌ల షేర్లు సైతం తీవ్రంగా నష్టపోయాయి. నిఫ్టీలో అత్యధికంగా లాభపడ్డ సంస్థల్లో ఎస్‌బీఐ లైఫ్‌ టాప్‌లో నిలిచింది. ఈ సంస్థ షేర్లు 2 శాతం రాణించాయి.

read more: CM KCR: మహబూబాబాద్ పరిస్థితి చూసి కన్నీళ్ళు పెట్టుకున్నా

తీవ్రంగా దెబ్బతిన్న కంపెనీల్లో దివిస్‌ ల్యాబ్స్‌ అగ్ర స్థానంలో ఉంది. ఈ సంస్థ స్టాక్స్‌ 3 శాతం లాసయ్యాయి. సెక్టార్‌ల వారీగా చూస్తే నిఫ్టీ ఐటీ అండ్‌ నిఫ్టీ మీడియా ఇండెక్స్‌లు జీరో పాయింట్‌ 8 శాతం వరకు పెరిగాయి. మరో వైపు.. నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ మరియు నిఫ్టీ బ్యాంక్‌ సూచీలు జీరో పాయింట్‌ 4 శాతం వరకు తగ్గిపోయాయి. వ్యక్తిగత స్టాక్స్‌ను పరిశీలిస్తే.. నైకా మరియు పేటీఎం షేర్ల ధరలు 9 శాతం పతనమయ్యాయి.

వరుణ్‌ బేవరేజెస్‌ స్టాక్స్‌ వ్యాల్యూ వరుసగా మూడో రోజు కూడా డౌన్‌ అయింది. ఇవాళ 4 శాతం నేల చూపులు చూశాయి. 10 గ్రాముల బంగారం రేటు 129 రూపాయలు పెరిగి గరిష్టంగా 55 వేల 822 రూపాయల వద్ద ట్రేడ్‌ అయింది. కేజీ వెండి రేటు 538 రూపాయలు పెరిగి అత్యధికంగా 68 వేల 511 రూపాయలు పలికింది. రూపాయి వ్యాల్యూ 6 పైసలు బలహీనపడింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 81 రూపాయల 6 పైసలుగా నమోదైంది.