Site icon NTV Telugu

TNPL 2025: బౌలింగే కాదు.. బ్యాటింగ్ లోనూ తగ్గేదేలే.. అద్భుతం చేసిన వరుణ్‌ చక్రవర్తి

Tnpl 2025

Tnpl 2025

TNPL 2025: క్రికెట్ అంటేనే జెంటిల్ మేన్ గేమ్. ఈ క్రికెట్ గేమ్ లో ఎన్నో రికార్డులు, ఎన్నో ఉద్వేగా క్షణాలను చూస్తూనే ఉంటాము. ప్రస్తుతం జరుగుతున్న తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2025లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఈ సంఘటనకు కారకుడయ్యాడు. మామూలుగా తన స్పిన్ బౌలింగ్ తో ప్రత్యర్థి ఆటగాళ్లను బెంబేలు ఎత్తించే వరుణ్ చక్రవర్తి ఈసారి మాత్రం తన బ్యాటుతో ప్రత్యర్థి జట్టుకి తన ప్రతాపం ఏంటో రుచి చూపించాడు.

Read Also:India Record: 93 ఏళ్ల చరిత్రను తిరగరాసిన టీమిండియా.. ఎలా అంటే..?

తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా సేలం స్పార్టన్స్‌, దిండిగుల్‌ డ్రాగన్స్‌ మధ్య జరిగిన మ్యాచ్ లో ఉద్వేగక్షణాలు ఎదురయ్యాయి. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన సేలం స్పార్టన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఇందులో రాజగోపాల్ 47 బంతులు 74 పరుగులు చేయడంతో భారీ స్కోరు చేయగలిగింది. ఈయనకు తోడుగా రాజేంద్రన్ 35, సన్నీ సందు 25 పరుగులతో మంచి స్కోరును అందుకున్నారు. ఇక దిండిగుల్‌ టీంలో కెప్టెన్ అశ్విన్ అద్భుతమైన బౌలింగ్ తో అదరగొట్టాడు. అశ్విన్ 22 పరుగులకు మూడు వికెట్లు తీయగా.. సందీప్ వారియర్, వరుణ్ చక్రవర్తి, కార్తీక్ శరన్ చేరో వికెట్ తీసుకున్నారు.

Read Also:Iran-Israel: ట్రంప్ ప్రకటన ఉత్తిదే.. ఇజ్రాయెల్‌పై తాజాగా ఇరాన్ క్షిపణి దాడులు

ఇక అనంతరం భారీ లక్ష ఛేదనకు వచ్చిన అశ్విన్ జట్టు మొదట్లో అదిరిపోయే ఆరంభాన్ని అందుకున్నారు. ఈ లీగ్ లో మొదటినుంచి ఓపెనర్ గా దిగుతున్న కెప్టెన్ అశ్విన్ ఈ మ్యాచ్ లో 14 బంతుల్లో ఏకంగా 36 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అశ్విన్ తర్వాత శివం సింగ్ 34, జయంత్ 25, సైని 35, విమల్ కుమార్ 24 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఒక వైపు వికెట్లు పడుతూనే ఉన్న లక్ష్యం వైపు టీం సాగుతోంది. ఈ నేపథ్యంలో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు వరుణ్ చక్రవర్తి. ఆ సమయంలో జట్టుకు గెలవాలంటే 11 బంతులతో 20 పరుగులు చేయాల్సి వచ్చింది. దానితో వరుణ్ చక్రవర్తి ఈసారి నమ్మశక్యం కానీ ఆట తీరును కనపరిచాడు. 5 బంతుల్లో 13 పరుగులు చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు.

ముఖ్యంగా చివరి రెండు బంతులకు ఏడు పరుగులు అవసరమైన సమయంలో వరుణ్ చక్రవర్తి వరుసగా ఒక సిక్సర్, ఒక బౌండరీ కొట్టి జట్టును గెలిపించాడు. ఇక బౌలింగ్, బ్యాటింగ్ లతో రెచ్చిపోయిన అశ్విన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. వరుణ్ చక్రవర్తి చివరి రెండు బాల్స్ ఆడిన ఆటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. విజయం అనంతరం కెప్టెన్ అశ్విన్ భావోద్వేగానికి లోనైనా సంఘటన కూడా మనం అందులో చూడవచ్చు.

Exit mobile version