Tamilnadu: కోయంబత్తూరులో కారులో సిలిండర్ పేలిన కేసు పత్రాలను శనివారం సాయంత్రం ఎన్‌ఐఏకు అప్పగించినట్లు తమిళనాడు పోలీసు అధికారులు వెల్లడించారు. కోయంబత్తూరు పేలుళ్ల కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కి అప్పగించడంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆరోపించిన తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి.. తీవ్రవాదంపై రాజకీయాలకు తావులేదని శుక్రవారం అన్నారు. “హై ప్రొఫైల్ టెర్రర్ ప్లాట్”లో కీలకమైన సాక్ష్యాలను ధ్వంసం చేయడంపై గవర్నర్ రవి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు రాజ్ భవన్ తెలిపింది.ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే కారు పేలుడును తీవ్ర ఉగ్రదాడి కుట్రగా నిర్ధారించిన పోలీసులను గవర్నర్ కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం మెతకగా వ్యవహరించడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై రాజకీయాలు వద్ద.. ఉగ్రవాదుల పట్ల్ ఉదాసీనత లేదని.. ఎందుకంటే వారు దేశానికి శత్రువుల గవర్నర్ అన్నారు. కాగా, శాంతిభద్రతల పరిస్థితిపై అన్నాడీఎంకే నేత, తమిళనాడు మాజీ మంత్రి ఆర్‌బీ ఉదయ కుమార్ డీఎంకే ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఎలాంటి చర్యలు తీసుకున్నారో ప్రజలకు చెప్పాలని ఆయన అన్నారు.
హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA)లోని కౌంటర్ టెర్రరిజం, కౌంటర్ రాడికలైజేషన్ (CTCR) విభాగం ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించాలని ఉగ్రవాద నిరోధక సంస్థను కోరుతూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఎన్‌ఐఏ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఎన్‌ఐఏ విచారణకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సిఫార్సు చేసిన ఒక రోజు తర్వాత హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు వెలువడింది. కోయంబత్తూర్‌లోని ఉక్కడం ప్రాంతంలో కారు సిలిండర్ పేలుడు ఘటనకు సంబంధించిన కేసు దర్యాప్తును ఎన్‌ఐఏకు బదిలీ చేయాలని స్టాలిన్ బుధవారం ఎంహెచ్‌ఏకు పంపిన సిఫార్సు లేఖలో కోరగా, కోయంబత్తూరులో భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించారు.
Delivery in an Ambulance : కదిలే రైలులో గర్భణీకి పురిటి నొప్పులు.. అంబులెన్స్‌లో ప్రసవం
ఈ కేసుకు సంబంధించి తమిళనాడు పోలీసులు ఇప్పటివరకు ఆరుగురిని అరెస్టు చేశారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) ప్రయోగించారు. అరెస్టయిన వారు అనుమానాస్పద పరిస్థితులలో కాల్చి చంపబడిన జమీషా ముబిన్ సహచరులుగా తెలిసింది. అతను నడుపుతున్న మారుతీ 800 వాహనంలోని ఎల్‌పీజీ సిలిండర్ తెల్లవారుజామున 4 గంటలకు ఆలయం సమీపంలో పేలింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన 25 ఏళ్ల ముబిన్‌ను గతంలో ఉగ్రవాద సంబంధాలపై 2019లో ఎన్‌ఐఏ ప్రశ్నించింది. ఈ కేసులో అతడి పేరును ప్రాథమిక నిందితుడిగా పేర్కొన్నారు.
సోమవారం రాత్రి అరెస్టయిన ఐదుగురిని మహ్మద్ తాల్కా (25), మహ్మద్ అసరుద్దీన్, 25, ముహమ్మద్ రియాజ్, 27, ఫిరోజ్ ఇస్మాయిల్, 27, మహ్మద్ నవాజ్ ఇస్మాయిల్, 27, అయితే ఆరో వ్యక్తి, మృతుడి బంధువు అఫ్సర్ ఖాన్‌గా గుర్తించారు. అతడిని ముందుగా గురువారం అరెస్టు చేశారు. రెండు రోజుల క్రితం ప్రత్యేక దర్యాప్తు బృందం అతన్ని అరెస్ట్ చేసింది. బుధవారం కూడా పోలీసు అధికారులు ఖాన్ నివాసంలో సోదాలు నిర్వహించి అతని ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఉక్కడంలోని ముబిన్ ఇంట్లో పేలుడు పదార్థాల తయారీకి ఉపయోగించే పదార్థాలను పోలీసులు గుర్తించినట్లు తమిళనాడు డీజీపీ తెలిపారు. పేలుడు పదార్థాల తయారీకి ఉపయోగపడే 75 కిలోల పొటాషియం నైట్రేట్, బొగ్గు, అల్యూమినియం పౌడర్, సల్ఫర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
