Tirumala: కలియుగ ప్రత్యక్షదైవం, కొలిచినవారి కొంగుబంగారం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు గమనిక.. తిరుమల శ్రీవారి దర్శన టోకెన్ల జారీ కేంద్రాలను మార్చింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అలిపిరి నడకమార్గంలో జారీ చేసే దర్శన టోకెన్లు.. ఇకపై అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్‌లోనే జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది.. ఇక, టోకెన్ పొందిన భక్తులు అలిపిరి నడకమార్గంలో 2083 మెట్టు దగ్గర స్కాన్ చేసుకుంటునే దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.. మరోవైపు.. సర్వదర్శనం భక్తులకు విష్ణు నివాసం, శ్రీనివాసం, గోవిందరాజ సత్రాల వద్ద టోకెన్లు జారీ చేయనుంది టీటీడీ.. అయితే, శ్రీవారి మెట్టు నడకమార్గంలో టోకెన్ల జారీలో ఎలాంటి మార్పులు చేయలేదని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతుంది.. 16 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది.. ఇక, నిన్న శ్రీవారిని 67,687 మంది భక్తులు దర్శించుకున్నారు.. 25,090 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.. గురువారం రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.95 కోట్లుగా ఉన్నట్టు టీటీడీ వెల్లడించింది.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?