Minister Anam Narayana Reddy: టీటీడీ వ్యవహారాలపై గత ప్రభుత్వ పాలన గురించి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా హీట్ పెంచుతున్నాయి. గత ఐదేళ్ల పాలనలో జరిగిన దోపిడీలను గుర్తు చేస్తూ, పలువురు భక్తుల హృదయాలను తాకిన అంశాలపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. పరకామణి కేసును పూర్తిగా మసిపూసి మారేడుకాయ చేశారని మండిపడ్డారు.. టీటీడీలో జరిగిన పరకామణి హుండీ లెక్కింపులో భారీ దోపిడీ జరిగినా, దానిని మునుపటి ప్రభుత్వం పూర్తిగా కప్పిపుచ్చిందన్నారు. కోట్లాది మంది భక్తులు నమ్మే శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కూడా దగా జరిగిందని మండిపడ్డారు. ఏ కార్యక్రమం చూసినా “మాఫియా రాజ్యం” నడిచిందని వ్యాఖ్యానించారు.
Read Also: బంపర్ ఆఫర్.. రూ. 60 వేలు విలువైన Samsung Galaxy S24 FE ఫోన్ కేవలం రూ. 31 వేలకే..
లోక్ అదాలత్ కేసులు ఎందుకు రాజీ చేసుకున్నారు..? అని నిలదీశారు ఆనం.. లోక్ అదాలత్‌లో కేసులను అనవసరంగా రాజీ చేసుకోవడం వెనుక పెద్ద లాభదాయక ఎజెండా ఉందన్నారు. పోలీసులను అదుపులో పెట్టుకొని, కేసులో ఉన్న వ్యక్తుల ఆస్తులను దోచుకున్న ఘడియలు కూడా ఉన్నాయని ఆరోపించారు. 9 డాలర్లు దోచుకున్న వ్యక్తి.. కోట్ల విలువైన ఆస్తులు ఎలా సంపాదించాడు?” అని ప్రశ్నించారు. అతని తప్పులను కప్పి, అతని ఆస్తులను ప్రభుత్వంగానే కొల్లగొట్టే పని జరిగిందని ఘాటుగా విమర్శించారు.
చుక్క పాలు లేకుండా నెయ్యి తయారు చేసిన ఘనత జగన్‌ది అంటూ సెటైర్లు వేవారు ఆనం.. మంత్రి వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. నెయ్యి ఎక్కడి నుంచి వస్తుందంటే మారుమూల ప్రాంత ముసలమ్మలు చెబుతారు.. కానీ, పాలు లేకుండానే నెయ్యి తయారు చేసే ఘనత మాత్రం జగన్‌దే!” అన్నారు. ప్రపంచమే ఈ ఫార్ములా మీద ఆశ్చర్యపోతుందని వ్యాఖ్యానించారు. ఇది టీటీడీ వ్యవస్థలను ఎలా దెబ్బతీసారో చూపించే ఉదాహరణ అని అన్నారు. దేవునినే వదల్లేకపోయిన వారు.. ప్రజలను వదిలే ప్రశ్నే లేదు అని ఆరోపించారు.. దేవదేవుడినే వదలని వారు.. సామాన్య ప్రజలను ఎలా వదిలేస్తారు? గత ప్రభుత్వ పాలనలో లక్ష కోట్లు దోచుకున్నారని విమర్శించారు.. టీటీడీ చైర్మన్ స్థానంలో జగన్ ఆత్మీయులను పెట్టడం కూడా సందేహాలకు తావిస్తుందని అన్నారు. టీటీడీ వ్యవస్థల పునర్నిర్మాణంలో ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.. ప్రస్తుతం దేవాదాయ శాఖ టీటీడీ పరిపాలనలో జరిగిన అన్యాయాలను వెలికితీయడంలో దృష్టి పెట్టిందని, భక్తుల విశ్వాసాన్ని తిరిగి స్థాపించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి..
