మొదటి సెల్‌ఫోన్‌లు వచ్చినప్పుడు వాటిల్లో నికెల్ బ్యాటరీలను వాడేవారు. అయితే వీటి వల్ల ఒక సమస్య వచ్చేది. అదేంటంటే నికెల్ బ్యాటరీ ఉన్న ఫోన్ ఎప్పుడు చార్జింగ్ పెట్టిన 10 శాతం పెట్టాల్సిందే. కాదని తక్కువ చార్జింగ్ పెట్టి తీసేస్తే అవి ఆ చార్జింగ్ కెపాసిటీకే ఫిక్స్ అవుతాయి. అందుకనే నికెల్ బ్యాటరీ లను ఇప్పుడు వాడడం లేదు. వాటి స్థానంలో లిథియం బ్యాటరీలు వచ్చాయి. అయితే వీటిలో ఇప్పుడు క్విక్ చార్జ్, ఫాస్ట్ చార్జ్ అనే ఆప్షన్‌లు ఉంటున్నాయి. అందువల్ల వీటిని త్వరగా చార్జింగ్ చేసుకోవచ్చు. అంతే కాదు ఈ బ్యాటరీలు నికెల్ బ్యాటరీల కన్నా ఎక్కువ లైఫ్ని ఇస్తాయి. అయితే లిథియం బ్యాటరీ లను పరిమితికి మించి అంటే 10 శాతం చార్జింగ్ అయినా చార్జింగ్ పెడితే ఫోన్ పేలే అయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలా వరకు ఫోన్‌లు ఇలా పేలేవే. కానీ ఈ మధ్య కాలంలో వస్తున్న క్విక్ చార్జ్, ఫాస్ట్ చార్జ్ అనే ఆప్షన్‌ల వల్ల ఇలా బ్యాటరీలు పేలే బాధ తప్పింది.
Also Read : Tech Tips : మొబైల్ రేడియేషన్ నుంచి తప్పించుకోవాలంటే.. ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే
అయినప్పటికీ ఇవి పేలవని చెప్పలేము. కాకపోతే అవి తేలేందుకు తక్కువ అవకాశం ఉంటుందట. అయినా ఇలాంటి ఆప్షన్‌లు ఉన్నాయి కదా అని చెప్పి ఫోన్‌లను రాత్రంతా చార్జింగ్ పెట్టరాదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే.. ఫోన్ బ్యాటరీల లైఫ్ తక్కువయేందుకు అవకాశం ఉంటుంది? బ్యాటరీలో పవర్ ఉంది లేనిది సరిగ్గా తెలియదు. డివైజ్‌లో 100 శాతం చార్జింగ్ ఉంది అని చూపుతుంది కానీ ఒక్కోసారి వెంటనే చార్జింగ్ అయిపోయినట్టు చూపిస్తుంది. అంటే అలాంటి బ్యాటరీలు కాలిబ్రేషన్ ఎర్రర్‌కు లోనైనట్లు తెలుసుకోవాలి. అలాంటప్పుడు ఫోన్ పూర్తిగా డిచార్జ్ అయ్యేంతవరకు ఉంచి, అది ఆఫ్ అయ్యాక చార్జింగ్ పెట్టాలి. 100 శాతం చార్జింగ్ అయ్యే వరకు ఫోన్‌ను ఆన్ చేయకూడదు. ఇలా చేస్తే సమస్య నుంచి బయట పడొచ్చు.
Also Read : Tips For Sinusitis : సైనస్ ని తగ్గించే ఇంటి చిట్కాలు
క్విక్ చార్జ్, ఫాస్ట్ చార్జ్ అనే ఆప్షన్ ఉన్నప్పటికీ రాత్రంతా డివైజ్‌ను చార్జింగ్‌లో పెట్టి ఉంచితే అప్పుడు డివైజ్ బాగా హీట్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో అవి పేలేందుకు అవకాశం ఉంటుంది? అలా పేలకపోయినా డివైజ్ చాలా హీట్ అవుతుంది. అందువల్ల దాని పనితనంలో మార్పు వస్తుంది. ఇక రోజంతా రెండు మూడు సార్లుకు మించి చార్జింగ్ పెట్టే వారు కూడా ఉంటారు. అలాంటి వారు ఏం చేయాలంటే డివైజ్‌లో 40 నుంచి 80 శాతం బ్యాటరీ ఉండేలా చూసుకొవాలి. 40శాతానికి తగ్గితేనే చార్జింగ్ పెట్టాలి. అలా కాకుండా చీటికి మాటికి చార్జింగ్ పెడితే దానివల్ల బ్యాటరీ లైఫ్ తగ్గి.. త్వరగా పాడవుతుంది. కనుక ఈ జాగ్రత్తలు పాటిస్తే బ్యాటరీ లైఫ్ ఎక్కువ వచ్చేలా చూసుకోవచ్చు.