Road Accident: విజయవాడలో ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది.. గొల్లపూడి సమీపంలో ఈ ఘటన జరిగింది.. విజయవాడ నుంచి హైదరబాద్ వైపు వెళ్తున్న BSR ట్రావెల్స్ కు చెందిన బస్సు ప్రమాదానికి గురైంది.. టిప్పర్ లారీ వచ్చి బస్సును ఢీ కొనడంతో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.. ప్రమాద సమయంలో సుమారుగా 30 మంది బస్సుల్లో ప్రయాణం చేస్తున్నట్టు తెలుస్తోంది.. వీరిలో దాదాపు 20 మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు.. వారిని వెంటనే సమీపంలోకి ఆసుపత్రికి తరలించారు. ఇక, హైవేపై బస్సు బోల్తా పడటంతో.. భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో, క్రేన్ సహాయంతో బస్సును తొలగించారు అధికారులు.. ఈ ప్రమాదంలో డ్రైవర్, సహా పలువరు ప్రయాణికులకు చిన్నపాటి గాయాలు కావడంతో.. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు చెబుతున్నారు.
Road Accident: బెజవాడలో ప్రైవేట్ బస్సు బోల్తా

Road Accident