Site icon NTV Telugu

TikTok : టిక్ టాక్‎కు చెక్.. నిషేధం విధించిన కెనడా ప్రభుత్వం

Tik Tok

Tik Tok

TikTok : టిక్ టాక్ కు మరో దేశం చెక్ పెట్టింది. ఈ యాప్ వినియోగాన్ని నిషేధిస్తున్నట్టు కెనడా ప్రభుత్వం ప్రకటించింది. భద్రతా కారణాల దృష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కెనడా ప్రభుత్వం తీసుకున్న తాజా నిషేధం టిక్ టాక్ కు పెద్ద షాక్ ఇచ్చినట్లైంది. చైనాకు చెందిన బైట్ డ్యాన్స్ కంపెనీ టిక్ టాక్ మాతృ సంస్థగా ఉంది. అన్ని మొబైల్స్‌, ఇతర డివైజెస్‌ నుంచి ఈ వీడియో షేరింగ్ యాప్ ను తొలగించాలని సూచించింది. కెనడా వాసుల ఆన్ లైన్ భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. చైనా సర్కారు పర్యవేక్షణలో నడిచే కంపెనీ కావడం, యూజర్ల డేటాపై కంపెనీకి నియంత్రణ ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా టిక్ టాక్ పై పలు దేశాల్లో ఆందోళనలు నెలకొన్నాయి.

Read Also: Drunken Drive : బంజారాహిల్స్‌లో మద్యం మత్తులో యువకుడి వీరంగం

కానీ, అవి ధైర్యంగా నిషేధ నిర్ణయం తీసుకోలేకపోతున్నాయి. 2020లో భారత్ టిక్ టాక్ పై నిషేధం విధించి మొదటి సారి షాక్ ఇచ్చింది. టిక్ టాక్ కు భారత్ అతిపెద్ద మార్కెట్ గా ఉండడమే కాదు. భారీగా యూజర్లను ఆకర్షించే తరుణంలో నిషేధానికి గురైంది. గల్వాన్ లోయ దాడి తర్వాత భారత్ టిక్ టాక్ సహా వందలాది చైనా యాప్ లను నిషేధించి గట్టి బదులిచ్చింది. కెనడా వాసుల ఆన్ లైన్ భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. టిక్ టాక్ పై నిషేధం ఈ దిశగా తీసుకున్న చర్యల్లో ఒకటని తెలిపారు.

Exit mobile version