Site icon NTV Telugu

Tiger Tension : రాంపూర్ అటవీ ప్రాంతంలో పులి ఆనవాళ్లు…

Tiger

Tiger

Tiger Tension : గత కొన్ని రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పులి కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో తాజాగా శుక్రవారం నాడు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని రాంపూర్ అటవీ ప్రాంతంలో జిల్లా అటవీ శాఖ అధికారి విశాల్, ఎఫ్డిఓ చంద్ర శేఖర్ , కొత్తగూడ రేంజ్ ఆఫీసర్ వజహత్ లు కలిసి పులి ఆనవాళ్ళ కొరకు అటవీ ప్రాంతంలో క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తుండంగా, రాంపూర్ అటవీ ప్రాంతంలోని మగ పులి ఆనవాళ్ళను మరోసారి కనుక్కోవడం జరిగింది.

Story Board: చైనాలో అసలేం జరుగుతుంది ? ప్రపంచ దేశాలు ఎందుకు వణికిపోతున్నాయి ?

తాజాగా శుక్రవారం గుర్తించిన ఆనవాళ్ళ ఆధారంగా మగ పులి అని అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు.. ప్రస్తుతం పులి కన్న గండి కామారం గుండాల వైపు, లేదా ములుగు నర్సంపేట ప్రాంతాల్లో ఉన్నట్లు అనుమానం వ్యక్తపరుస్తున్నారు… కొత్తగూడ రేంజ్ పరిధిలోని అధికారులు ఎప్పటికప్పుడు, టీంల వారిగా ఏర్పాటు చేసుకొని పులి కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, డీ ఎఫ్ ఓ విశాల్ తెలిపారు

Game Changer : “గేమ్ ఛేంజర్” సెన్సేషన్.. థియేటర్లలో సోల్డ్ ఔట్ బోర్డ్స్

Exit mobile version