Tiger Shroff : ‘బాఘీ’ ఫ్రాంచైజ్ లో మరో మూవీ ప్రకటించిన టైగర్ ష్రాఫ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ లో టైగర్ ష్రాఫ్ యంగ్ అండ్ యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ వారసుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టాడు టైగర్. తను హీరోగా పరిచయం అయి పదేళ్లు పూర్తి అయింది.అయితే ఈ పదేళ్లలో తను నటించిన ఒరిజినల్ కథల సినిమాలకంటే రీమేక్సే ఎక్కువ. అలా రీమేక్స్ తోనే ‘బాఘీ’ అనే ఒక మూవీ ఫ్రాంచైజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు టైగర్ ష్రాఫ్. ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్లో నాలుగో సినిమా రానుందని టైగర్ అనౌన్స్ చేయగా ఈసారి ఏ సౌత్ సినిమా బలైపోతుందో అని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.‘హీరోపంతి’ అనే సినిమాతో టైగర్ ష్రాఫ్ హీరోగా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఇది ఒకప్పుడు తెలుగులో సూపర్ హిట్ అయిన ‘పరుగు’ సినిమా రీమేక్. ఇందులో హీరోగా అల్లు అర్జున్ చేసిన పాత్రను రీమేక్లో టైగర్ ష్రాఫ్ నటించాడు. హీరోయిన్ గా కృతి సనన్ నటించింది.. ఆ తర్వాత ‘బాఘీ’ అనే చిత్రంతో ఆడియన్స్ ని పలకరించాడు. అది తెలుగులో ప్రభాస్, త్రిష నటించిన ‘వర్షం’ చిత్రానికి రీమేక్.
ఆ తర్వాత తను కొన్ని ఒరిజినల్ చిత్రాల్లో నటించినా కూడా అవి తనకు అంతగా హిట్ అందించలేకపోయాయి.దీంతో మరోసారి అడవి శేష్ హీరోగా నటించిన ‘క్షణం’ అనే థ్రిల్లర్ మూవీని ‘బాఘీ 2’ పేరుతో రీమేక్ చేశాడు టైగర్. ఇలా వరుస రీమేక్స్ తోనే ఈ హీరో హిట్స్ అందుకున్నాడు.2020లో ‘బాఘీ’ ఫ్రాంచైజ్ నుండి చివరి మూవీ రిలీజ్ అయ్యింది. అదే ‘బాఘీ 3’. ఇది కూడా ఒక సౌత్ సినిమాకు రీమేకే. తమిళంలో మాధవన్ హీరోగా తెరకెక్కిన ‘వెట్టాయ్’ చిత్రాన్ని ‘తడాఖా’ పేరుతో నాగచైతన్య, సునీల్.. తెలుగులో రీమేక్ చేశారు. అదే సినిమాను ‘బాఘీ 3’ పేరుతో హిందీలో రీమేక్ చేశారు టైగర్ ష్రాఫ్. అలా ‘బాఘీ’ ఫ్రాంచైజ్లో ఇప్పటివరకు విడుదలయిన సినిమాలన్నీ రీమేక్ లే కావడం విశేషం.అయితే ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్ నుండి నాలుగో చిత్రం రానుందని టైగర్ ష్రాఫ్ తాజాగా తన ఇంస్టాగ్రామ్ ద్వారా ప్రకటించాడు. అంతే కాకుండా ‘బాఘీ 4’ 2025లో విడుదల అవుతుందని కూడా అనౌన్స్ చేశారు. మరి ఈ సినిమా ఈ మూవీకి రీమేక్ అయ్యింటుంది అని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు.
Also Read
- 4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
- Shubman Gill: భారత క్రికెట్ చరిత్రను మార్చనున్న కెప్టెన్ గిల్.. విరాట్, రోహిత్‌కి కూడా సాధ్యం కాలేదు..
- 9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
- Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
తాజావార్తలు
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
Shubman Gill: భారత క్రికెట్ చరిత్రను మార్చనున్న కెప్టెన్ గిల్.. విరాట్, రోహిత్‌కి కూడా సాధ్యం కాలేదు..
-
Rocky Flintoff: తండ్రిని మించిన కొడుకు.. 18 ఏళ్ల రాకీ ఫ్లింటాఫ్ విధ్వంసం.. తండ్రి రికార్డులే టార్గెట్!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
ట్రెండింగ్
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!