Site icon NTV Telugu

Tiger Nageswara Rao : టైగర్ నాగేశ్వరావు నుంచి రిలీజ్ అయిన రొమాంటిక్ మెలోడీ..

Whatsapp Image 2023 10 13 At 11.56.00 Am

Whatsapp Image 2023 10 13 At 11.56.00 Am

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరావు.. ఈ సినిమా తో తొలిసారి పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా బ్లాక్‌ బస్టర్స్ ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 ని అందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ అభిషేక్ అగర్వాల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో నిర్మించారు.రీసెంట్ గా ఈ చిత్రం నుంచి విడుదలై ట్రైలర్‌ కు నేషనల్ వైడ్ గా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.యంగ్ అండ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ ఈ సినిమా కి సంగీతం అందిస్తున్నారు.టైగర్ నాగేశ్వరరావు సినిమాలో ఇప్పటికే విడుదల అయిన రెండు పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.. తాజాగా ఈ మూవీ నుంచి థర్డ్ సింగిల్ ‘ఇచ్చేసుకుంటాలే’ పాటని విడుదల చేశారు మేకర్స్.

బ్యూటీఫుల్ అండ్ రొమాంటిక్ మెలోడీగా ఈ పాటని కంపోజ్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్. భాస్కరభట్ల రవికుమార్ అందించిన సాహిత్యం.. హీరోయిన్ మనసులోని ప్రేమని ఎంతో అందంగా ఆవిష్కరించింది. సింధూరి మెస్మరైజ్ వాయిస్‌తో ఆకట్టుకున్నారు.టైగర్ నాగేశ్వరరావు సినిమా ఇచ్చేసుకుంటాలే పాటలో రవితేజ, గాయత్రి భరద్వాజ్‌ల కెమిస్ట్రీ అద్భుతం గా ఉంది. విజువల్స్ కూడా ఎంతో ఎక్స్ ట్రార్డినరీగా ఉన్నాయి. ఇదిలా ఉంటే నుపుర్ సనన్ మరో హీరోయిన్‌గా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు మూవీలో రేణు దేశాయ్ మరియు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్‌ మదీ ఐఎస్‌సి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కాగా టైగర్ నాగేశ్వరరావు మూవీని దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 20 న పాన్ ఇండియా రేంజ్ లో భారీగా విడుదల చేస్తున్నారు.రవితేజ ఈ సినిమా పై ఎంతో కాన్ఫిడెంట్ గా వున్నారు. ఈ సినిమా కచ్చితంగా అద్భుత విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ ఎంతో నమ్మకంతో వుంది

Exit mobile version