NTV Telugu Site icon

Tiger 3 : త్వరలో ఓటీటీ స్ట్రీమింగ్ కు రానున్న టైగర్ 3. అధికారికంగా ప్రకటించిన అమెజాన్ ప్రైమ్ వీడియో..

Whatsapp Image 2024 01 06 At 9.20.22 Pm

Whatsapp Image 2024 01 06 At 9.20.22 Pm

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘టైగర్-3’.గతేడాది దీపావళి సీజన్‍లో వచ్చిన ఈ చిత్రం సుమారు రూ.450కోట్లకు పైగా కలెక్షన్లను దక్కించుకుంది.యశ్‍రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌ లైనప్‍లో ఐదో చిత్రంగా ‘టైగర్ 3’ వచ్చింది. మనీశ్ మిశ్రా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సల్మాన్ యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి. అయితే, ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. ఈ క్రమంలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ అప్‍డేట్ ఇచ్చింది.టైగర్ 3 సినిమాను త్వరలో స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్ నేడు వెల్లడించింది. కానీ, త్వరలో అని చెప్పింది కానీ కచ్చితమైన స్ట్రీమింగ్ డేట్‍ను మాత్రం వెల్లడించలేదు. “టైగర్ వచ్చేస్తోంది. ప్రైమ్‍లో టైగర్ 3 త్వరలో” అని ప్రైమ్ వీడియో ట్వీట్ చేసింది. డేట్‍ను మాత్రం వెల్లడించలేదు. అయితే, స్ట్రీమింగ్ డేట్‍ను అతిత్వరలోనే ప్రైమ్ వీడియో ఖరారు చేస్తుండని తెలుస్తోంది. మరో మూడు రోజుల్లో టైగర్ 3 స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

టైగర్ 3 మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వస్తుంది. ఈ విషయాన్ని ప్రైమ్ వెల్లడించింది. సల్మాన్ ఖాన్, కత్రీనా కైఫ్ మరియు ఇమ్రాన్ హష్మి గన్స్ పట్టుకున్న ఓ పోస్టర్‌ను ట్వీట్ చేసింది. కొత్త సంవత్సరం సందర్భంగా 2023 డిసెంబర్ 31నే టైగర్ 3 ఓటీటీలోకి వస్తుందని అప్పట్లో వార్తలు వచ్చాయి.. అయితే ప్రైమ్ వీడియో మరింత ఆలస్యం చేసింది. ఇప్పుడు ఎట్టకేలకు అప్‍డేట్ ఇచ్చింది.టైగర్ 3 చిత్రంలో రా ఏజెంట్‍గా సల్మాన్ ఖాన్ నటించారు. అతడి భార్య, ఐఎస్ఐ ఏజెంట్ జోయా పాత్రలో హీరోయిన్ కత్రినా కైఫ్ కనిపించారు. ఇమ్రాన్ హష్మి, రేవతి, సిమ్రన్, రిధి డోగ్రా, విశాల్ జేత్వా మరియు కుముద్ మిశ్రా కీలకపాత్రలు పోషించారు. మనీశ్ శర్మ తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రీతమ్ మరియు తనూజ్ టికు సంగీతం అందించారు.