NTV Telugu Site icon

Thunderstorm : మెదక్ జిల్లాలో విషాదం.. పిడుగుపడి తండ్రికొడుకులు మృతి

Thunderstrom

Thunderstrom

తెలంగాణలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కారణంగా తీవ్రంగ పంట నష్టం జరుగుతోంది. అయితే.. ఈ నేపథ్యంలోనే మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద పిడుగు పడి ఇద్దరు మృతి చెందారు. మృతులు పెద్ద శంకరంపేట (మం) రామోజీపల్లి వాసులుగా గుర్తించారు పోలీసులు. అయితే.. ధాన్యం ఆరబెట్టడానికి కొడుకుని తీసుకువచ్చాడు తండ్రి.. ఈ క్రమంలోనే.. ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం రావడంతో చెట్టు కిందకి వెళ్లారు తండ్రికొడుకులు. దీంతో.. ఒక్కసారిగా.. వీళ్లు ఉన్న చెట్టుపై పిడుగుపడటంతో అక్కడికక్కడే తండ్రీకొడుకులు రాములు(46)విశాల్(14) మృతి చెందారు. దీంతో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదిలా ఉంటే.. ఆదిలాబాద్ జిల్లా లోని పలు మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. జైనాథ్, బేల మండలాల్లో గాలులతో కూడిన వర్షం పడింది. బేల మండలం సిరసన్న లో వడగళ్ల వాన పడింది. జై నాథ్ మండలం గిమ్మ లో పిడుగు పడి 5గురికి గాయాలు కావడంతో.. మ్స్ కు తరలించారు. రిమ్స్ లో క్షత గాత్రులను పరామర్శించి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు మాజీ మంత్రి జోగు రామన్న. ఇదే కాకుండా.. సంగారెడ్డి, మెదక్ జిల్లాలో గాలి వాన బీభత్సం సృష్టించింది. సంగారెడ్డి జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వాన కురియడంతో.. గాలికి టార్పాలిన్ కవర్లు ఎగిరిపోయిన పలు చోట్ల వర్షానికి ధాన్యం తడిచిపోయింది. సంగారెడ్డి జిల్లా నాగలిగిద్ద (మం) ముక్తాపూర్ లో 51 మీ.మీజ్ మొగుడంపల్లి 26 మీ.మీ వర్షపాతం నమోదు కాగా.. మెదక్ జిల్లా పాపన్నపేట (మం) లింగాయిపల్లిలో 19 మీ.మీ వర్షపాతం నమోదైంది.