Mahi Gupta team leader: మెట్రో స్టేషన్‌కు టీమ్ లీడర్‌గా హిజ్రా.. సహించని వారే సలాం కొట్టేలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahi Gupta team leader: హిజ్రాలు అంటే సమాజంలో చిన్న చూపుచూస్తారు.. వారు జబర్దస్త్‌గా డబ్బులు వసూలు చేస్తారని.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడతారని .. రైళ్లల్లో బలవంతంగా బెదిరించి డబ్బులు వసూలు చేస్తారని ఎక్కువ మంది భావిస్తారు. మంచివారు, చెడ్డవారు ఆడ,మగ జాతుల్లో ఎలా ఉన్నారో.. హిజ్రాల్లో కూడా మంచి వాళ్లు, చెడ్డవాళ్లు ఉంటారని అనేక సంఘటనలు కూడా మనకు రుజువు చేశాయి. జీవితంలో ఏదైనా సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న వారు కూడా ఉన్నారు. కన్నవారే కాదన్నా.. సమాజం పట్టించుకోకపోయినా వెనకడుగు వేయకుండా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అలాంటి ఉన్నత విలువలు కలిగిన హిజ్రానే యూపీకి చెందిన మహీ గుప్తా. ఉత్తరప్రదేశ్ నోయిడాలో హిజ్రాలకు అంకితం చేసిన ప్రైడ్ మెట్రోస్టేషన్‌కు టీమ్ లీడర్‌గా నిలిచింది. ఈ మెట్రోలో పని చేసే వారంతా హిజ్రాలే కావడం గమనార్హం. ఒకప్పుడు తనను ఊర్లోనుంచి వెళ్లగొట్టిన వారే ఇప్పుడు అభినంధనలు తెలియజేస్తున్నారని మహీ గుప్తా తెలిపారు. ఈ విజయం వెనుక ఎన్నో ఏళ్ల కష్టం ఉందని మహీ వెల్లడించారు.
Bike Accident : ప్రాణం తీసిన అతివేగం.. అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న బైక్
Also Read
- Yashasvi Jaiswal: ‘అలా ప్రవర్తించకూడదు’.. జైస్వాల్‌పై ఐసీసీ చర్యలు తప్పవు?
- IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
- Monday Horoscope: వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు ఎవరికి..? నేటి ద్వాదశ రాశుల పూర్తి సమాచారం ఇలా.!
- Yashasvi Jaiswal: కొలంబో టెస్టులో హైడ్రామా.. జైస్వాల్–ఫెర్నాండో ఫైట్.. అసలు ఏం జరిగిందంటే?
బీహార్‌లోని కటిహార్ జిల్లా సెమాపూర్ గ్రామానికి చెందిన మహీ గుప్తా.. ఓ హిజ్రా అని తెలియడంతో 2007లో ఆమెను ఇంటి నుంచి కన్నవాళ్లే వెళ్లగొట్టారు. అయినా వెనకడుగు వేయకుండా ట్యూషన్లు చెబుతూ వచ్చే డబ్బుతో చదువుకుంది. 2017లో మహీ గుప్తా కుటుంబసభ్యులు ఆమెను తిరిగి ఇంటికి ఆహ్వానించారు. 2019లో హిజ్రాలకు దిల్లీ ప్రభుత్వం ఉద్యోగావకాశాలు కల్పిస్తోందని తెలుసుకుని.. ఎంతో కష్టపడి చదివింది. అనేక అవాంతరాలను ఎదుర్కొని ఉద్యోగం సాధించి.. టీమ్ లీడర్ స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం తాను సాధించిన ఈ విజయంపట్ల గ్రామం నుంచి వెళ్లగొట్టిన వారే.. ఫోన్‌లు చేసి అభినందనలు తెలుపుతూ తనని కలవడానికి ప్రయత్నిస్తున్నట్లు మహీ గుప్తా గర్వంగా చెబుతున్నారు. ఇతరుల నుంచి ఎన్ని అడ్డంకులు వచ్చినా.. వారెన్ని మాటలన్నా సరే మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో ధృడంగా ఉండాలంటూ మహీ గుప్తా చెబుతున్నారు. నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ తన పరిధిలోని 50వ సెక్టారు స్టేషనుకు ‘ప్రైడ్ స్టేషన్’గా పునఃనామకరణం చేస్తూ హిజ్రాల వర్గానికి అంకితం చేసింది. ఉత్తర భారత మెట్రో సర్వీసుల చరిత్రలో ఇదో విప్లవాత్మక నిర్ణయం.
తాజావార్తలు
-
Yashasvi Jaiswal: ‘అలా ప్రవర్తించకూడదు’.. జైస్వాల్‌పై ఐసీసీ చర్యలు తప్పవు?
-
Karn Sharma Retirement: నాలుగు ఐపీఎల్ టైటిళ్ల హీరో రిటైర్మెంట్.. భారత్, ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌కు గుడ్‌బై!
-
Rahul Ramakrishna: అలాంటి పాత్రలు చేయడం ఇష్టం లేదు.. విజయ్ దేవరకొండ నా కాల్స్ తీసుకోవడం మానేశాడు..
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Ajith Kumar: అజిత్‌తో రాజమౌళి అసిస్టెంట్ సినిమా?.. భారీ పాన్ ఇండియా ప్లాన్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!