NTV Telugu Site icon

Mahi Gupta team leader: మెట్రో స్టేషన్‌కు టీమ్‌ లీడర్‌గా హిజ్రా.. సహించని వారే సలాం కొట్టేలా..

Mahi Gupta

Mahi Gupta

Mahi Gupta team leader: హిజ్రాలు అంటే సమాజంలో చిన్న చూపుచూస్తారు.. వారు జబర్దస్త్‌గా డబ్బులు వసూలు చేస్తారని.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడతారని .. రైళ్లల్లో బలవంతంగా బెదిరించి డబ్బులు వసూలు చేస్తారని ఎక్కువ మంది భావిస్తారు. మంచివారు, చెడ్డవారు ఆడ,మగ జాతుల్లో ఎలా ఉన్నారో.. హిజ్రాల్లో కూడా మంచి వాళ్లు, చెడ్డవాళ్లు ఉంటారని అనేక సంఘటనలు కూడా మనకు రుజువు చేశాయి. జీవితంలో ఏదైనా సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న వారు కూడా ఉన్నారు. కన్నవారే కాదన్నా.. సమాజం పట్టించుకోకపోయినా వెనకడుగు వేయకుండా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అలాంటి ఉన్నత విలువలు కలిగిన హిజ్రానే యూపీకి చెందిన మహీ గుప్తా. ఉత్తరప్రదేశ్‌ నోయిడాలో హిజ్రాలకు అంకితం చేసిన ప్రైడ్ మెట్రోస్టేషన్‌కు టీమ్‌ లీడర్‌గా నిలిచింది. ఈ మెట్రోలో పని చేసే వారంతా హిజ్రాలే కావడం గమనార్హం. ఒకప్పుడు తనను ఊర్లోనుంచి వెళ్లగొట్టిన వారే ఇప్పుడు అభినంధనలు తెలియజేస్తున్నారని మహీ గుప్తా తెలిపారు. ఈ విజయం వెనుక ఎన్నో ఏళ్ల కష్టం ఉందని మహీ వెల్లడించారు.

Bike Accident : ప్రాణం తీసిన అతివేగం.. అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న బైక్‌

బీహార్‌లోని కటిహార్‌ జిల్లా సెమాపూర్‌ గ్రామానికి చెందిన మహీ గుప్తా.. ఓ హిజ్రా అని తెలియడంతో 2007లో ఆమెను ఇంటి నుంచి కన్నవాళ్లే వెళ్లగొట్టారు. అయినా వెనకడుగు వేయకుండా ట్యూషన్లు చెబుతూ వచ్చే డబ్బుతో చదువుకుంది. 2017లో మహీ గుప్తా కుటుంబసభ్యులు ఆమెను తిరిగి ఇంటికి ఆహ్వానించారు. 2019లో హిజ్రాలకు దిల్లీ ప్రభుత్వం ఉద్యోగావకాశాలు కల్పిస్తోందని తెలుసుకుని.. ఎంతో కష్టపడి చదివింది. అనేక అవాంతరాలను ఎదుర్కొని ఉద్యోగం సాధించి.. టీమ్​ లీడర్​ స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం తాను సాధించిన ఈ విజయంపట్ల గ్రామం నుంచి వెళ్లగొట్టిన వారే.. ఫోన్‌లు చేసి అభినందనలు తెలుపుతూ తనని కలవడానికి ప్రయత్నిస్తున్నట్లు మహీ గుప్తా గర్వంగా చెబుతున్నారు. ఇతరుల నుంచి ఎన్ని అడ్డంకులు వచ్చినా.. వారెన్ని మాటలన్నా సరే మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో ధృడంగా ఉండాలంటూ మహీ గుప్తా చెబుతున్నారు. నోయిడా మెట్రో రైల్​ కార్పొరేషన్ తన పరిధిలోని 50వ సెక్టారు స్టేషనుకు ‘ప్రైడ్​ స్టేషన్​’గా పునఃనామకరణం చేస్తూ హిజ్రాల వర్గానికి అంకితం చేసింది. ఉత్తర భారత మెట్రో సర్వీసుల చరిత్రలో ఇదో విప్లవాత్మక నిర్ణయం.