Originals vs Brave: మాంచెస్టర్ వేదికగా జరిగిన ‘ది హండ్రెడ్’ పురుషుల టోర్నమెంట్ రెండో మ్యాచ్‌లో సదర్న్ బ్రేవ్ అదిరిపోయే విజయాన్ని నమోదు చేసింది. చివరి బంతికి వికెట్ మాత్రమే కాకుండా విజయం కూడా సాధించి ఉత్కంఠతకు తేరా దించాడు. ఈ మ్యాచ్‌లో టైమల్ మిల్స్ తన అద్భుతమైన బౌలింగ్‌తో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో సంజీవ్ గోయెంకా సంబంధించిన లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టు పేలవమైన ప్రదర్శన ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా ఇప్పుడు ఆయన కొత్త జట్టు మాంచెస్టర్ ఒరిజినల్స్ ఇంగ్లాండ్‌లో ఓటమితో టోర్నమెంట్ ను మొదలు పెట్టింది.
Jr. NTR : వార్ – 2 వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రమోషన్స్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్
మాంచెస్టర్ ఒరిజినల్స్ కెప్టెన్ ఫిల్ సాల్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఫిల్ సాల్ట్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి 41 బంతుల్లో 60 పరుగులతో జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత జోస్ బట్లర్ (22), హైన్‌రిచ్ క్లాసెన్ (15) కూడా మద్దతుగా నిలిచారు. చివర్లో మార్క్ చాప్మన్ 22, లూయిస్ గ్రెగరీ 6 పరుగులు చేసి జట్టుకు నిర్ణిత 100 బంతులతో 4 వికెట్లు కోల్పోయి 131 రన్స్‌ను చేశారు. ఇక బ్రేవ్ బౌలర్లలో టైమల్ మిల్స్ 3 వికెట్లతో అత్యుత్తమ బౌలింగ్ చేశాడు. ఓవర్టన్ ఒక వికెట్ తీశాడు మిగతా బౌలర్లు మంచి కట్టుదిట్టమైన బౌలింగ్ చేశారు.
Hyderabad: నగరం నడిబొడ్డులో పట్ట పగలే హత్య.. కత్తులతో దారుణంగా నరికి…
ఇక 132 పరుగుల లక్ష్యంతో దిగిన సదర్న్ బ్రేవ్ జట్టు చివరి బంతికి వికెట్ మిగిలి ఉండగానే విజయాన్ని సాధించింది. మొత్తంగా 99 బంతుల్లో 9 వికెట్లు కోల్పోయి 133 స్కోర్ చేసి 1 వికెట్ తేడాతో మ్యాచ్ గెలిచింది. వీరి ఇన్నింగ్స్ లో జేసన్ రాయ్ (30), ల్యూస్ డు ప్లోయ్ (25) మంచి ప్రారంభం ఇచ్చారు. కానీ, మిడిలార్డర్ కాస్త తడబడి వరుసగా వికెట్లు కోల్పోయింది. చివర్లో ఓవర్టన్ (18 నాటౌట్), టైమల్ మిల్స్ (8), టాప్లే (4) కలిసి అదిరిపోయే ఫినిష్ ఇచ్చారు. సదర్న్ బ్రేవ్ టీంలో స్కాట్ కరి అత్యద్భుత బౌలింగ్ చేసి 4 వికెట్లు పడగొట్టాడు. ఇంకా సన్నీ బేకర్ 2, నూర్ అహ్మద్ 2, లూయిస్ గ్రెగరీ 1 వికెట్లు తీసారు. అయితే బౌలింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన మిల్స్ 20 బంతుల్లో 3 వికెట్లు తీసి, తర్వాత 4 బంతుల్లో 8 పరుగులు చేసి బ్యాటింగ్‌లో కూడా కంట్రిబ్యూషన్ ఇచ్చాడు. దీనితో *’ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. సదర్న్ బ్రేవ్ 1 వికెట్ తేడాతో గెలుపొంది పాయింట్ల పట్టికలో ముందుకు దూసుకెళ్లింది.
