పొలాల్లోకి తీసుకెళ్లి ఓ యువతిపై ముగ్గురు యువకులు అత్యాచారం చేసిన ఘటన యూపీలోని హమీర్‌పూర్ జిల్లాలో జరిగింది. రాత్ గ్రామంలో ముగ్గురు యువకులు బాలికను బైక్‌పై బలవంతంగా పొలాల్లోకి తీసుకెళ్లారు. అక్కడ ముగ్గురు కలిసి ఆమెపై సామూహిక అత్యాచారం చేసి, అనంతరం ఆ యువతిని వదిలేసి పారిపోయారు. అనంతరం.. బాధితురాలు పోలీసులకు సమాచారం అందించింది. ఈ ఘటనపై బాధితురాలి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో.. నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ ఘటన బుధవారం జరగ్గా.. బుధోలియానా మొహల్లాలో నివాసం ఉంటున్న శివం, బజారియాకు చెందిన నవీన్, అన్వర్‌లు కలిసి బైక్‌పై తన సోదరిని తీసుకెళ్లినట్లు బాదితురాలు సోదరి చెప్పింది.
Read Also: Rajya Sabha: ఇద్దరు వైసీపీ ఎంపీల రాజీనామా ఆమోదం
సాయంత్రం ముగ్గురూ తన సోదరిని సర్సాయి గ్రామంలోని పొలాల్లోకి తీసుకెళ్లి ఒక్కొక్కరుగా అత్యాచారం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. అత్యాచారం అనంతరం తన అక్కను పొలాల్లో వదిలి పారిపోయార చెప్పింది. బాటసారుల సహాయంతో యువతి పోలీసులకు సమాచారం అందించిందన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాలికను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో.. నిందితులపై బాధితురాలి సోదరి ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా.. అత్యాచారం చేసిన అనంతరం తన సోదరికి మద్యం తాగించారని పేర్కొంది. ఈ క్రమంలో.. నిందితులపై కేసు నమోదు చేసి బాలికను వైద్య పరీక్షల నిమిత్తం పంపినట్లు పోలీసులు తెలిపారు. త్వరలో నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపుతామన్నారు.
Read Also: ICC Test Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల.. టాప్ 10లో టీమిండియా క్రికెటర్లు వీళ్లే
