మనం ఎవరినైనా అడ్డుకోవచ్చు.. కానీ ఎవరి జోలికైనా వెళ్లొచ్చు గానీ.. మహిళల మధ్య పంచాయితీకి వెళ్లారంటే మీ బతుకు బస్టాండే అనే విషయాన్ని గమనించాలి అని పెద్దలు చెబుతుంటారు. కారణం ఏంటంటే.. మధ్యలోకి వెళ్లిన వారి వీపు విమానం మోత మోగడం మాత్రం పక్క అని అంటారు. తాజాగా కొందరు మహిళలు కోర్టులోనే ఎగిరేగిరి కొట్టుకున్న వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
Also Read: Garuda Purana: గరుడ పురాణం ప్రకారం మరణానికి ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి!
అయితే మహిళలను ఆపేందుకు ప్రయత్నం చేసిన లాయర్ ను సైతం కొట్టే ప్రయత్నం కూడా ఈ వీడియోలో మనం చూడొచ్చు.. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ ఇదేంది ఇలా కొట్టుకుంటున్నారు అని నోరేళ్లబెడుతున్నారు. లక్నో ఫ్యామిలీ కోర్టులో ఓ కేసు విచారణ నిమిత్తం ఇరు వర్గాలకు చెందిన వారు వచ్చారు. మరి ఆ కోర్టు ఏం తీర్పు ఇచ్చిందో.. వీరి మధ్య ఏం జరిగిందో కానీ.. ఈ కేసుకు సంబంధించిన మహిళలందరూ కోర్టు హాలులోనే పెద్ద యుద్ధమే చేశారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు.
Also Read: Uttara Pradesh: పాపం.. పెళ్లి కొడుకును చెట్టుకు కట్టేసిన వధువు బంధువులు
అయితే వీరిని అడ్డుకునేందుకు కొందరు లాయర్లు ప్రయత్నించగా.. వారు మాత్రం అస్సలు తగ్గలేదు. పైగా, ఓ లాయర్‌ను సైతం మహిళలు కొట్టబోయారు. ఒకరిపై ఒకరు ఎగురుకుంటూ తన్నుకున్నారు. చెప్పులు తెగేలా ఒకరిని ఒకరు కొట్టుకుంటుంటే అక్కడ ఉన్నారు.. చూస్తూ ఉండిపోయారు. జుట్టు పట్టుకుని కోర్టులోనే నానా రచ్చ చేశారు. ఈ సీన్‌ను కోర్టులోని కొందరు తమ ఫోన్ లలో రికార్డ్ చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. ఈ వీడియోపై నెటిజన్స్ వెరైటీ కామెంట్స్ చేస్తున్నారు.
Kalesh b/w two woman inside Family Court Lucknowpic.twitter.com/QqZgRMJkXu
— Ghar Ke Kalesh (@gharkekalesh) June 15, 2023
