NTV Telugu Site icon

Train Derailed: రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన పెట్రోలియం ఉత్పత్తులతో వెళ్తున్న గూడ్స్ రైలు!

Train

Train

Train Derailed: గురువారం రాత్రి మధ్యప్రదేశ్‌ లోని రత్లామ్‌లో ఢిల్లీ – ముంబై మార్గంలో రైల్వే యార్డు సమీపంలో పెట్రోలియం ఉత్పత్తులతో వెళ్తున్న గూడ్స్ రైలు మూడు కోచ్‌లు పట్టాలు తప్పాయి. సమాచారం మేరకు ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ఘటనపై సంబంధించి రత్లాం డివిజనల్ రైల్వే మేనేజర్ (డిఆర్‌ఎం) రజనీష్ కుమార్ మాట్లాడుతూ.. వ్యాగన్ నుండి పెట్రోలియం లీక్ అవుతుందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.

Fastag Recharge Rules Change: ఫాస్టాగ్ రీఛార్జ్ నియమాలలో మార్పు.. గమనించారా?

రాజ్‌కోట్‌ నుంచి భోపాల్‌ సమీపంలోని బకానియా – భౌరీకి వ్యాగన్‌ లను తీసుకెళ్తున్నట్లు తెలిపారు. ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. అప్‌లైన్‌లో వెళ్లే రైళ్లపై ఎలాంటి ప్రభావం పడలేదని డీఆర్‌ఎం తెలిపారు. మేము త్వరలో అప్ ట్రాక్ నుండి డౌన్ లైన్ రైళ్లను నడపడం ప్రారంభిస్తామని., ఈ ఘటనతో ప్రస్తుతం రెండు రైళ్లు మాత్రమే నిలిచిపోయాయని ఆయన తెలిపారు.

Agricultural Development: లక్ష కోట్లతో వ్యవసాయ అభివృద్ధి పథకాలకు ఆమోదం!

ఇకపోతే ఘటనలో రైలు మూడు కోచ్‌లు పట్టాలు తప్పినట్లు డీఆర్‌ఎం తెలిపారు. ఇందలో ఒక పెట్టె పక్కకి తీసివేయబడిందని., మిగితా రెండింటితో కొంత సమస్య ఉందని., అయితే అది కూడా అతి త్వరలో తొలగించబడుతుందని తెలిపారు. ఇక ఘటన సంబంధించిన అన్ని ఆధారాలను సేకరిస్తున్నామని., ఏ రైలును రద్దు చేయడం లేదని, కొన్ని రైళ్లు మాత్రం కాస్త ఆలస్యం కావచ్చని తెలిపారు.

Show comments