Israel Protest : ఇజ్రాయెల్‌లో బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రనిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తీవ్రవాద పార్టీల సహాయంతో అధికారంలోకి వచ్చిన నెతన్యాహు కొత్త ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు శనివారం వీధుల్లోకి వచ్చారు. బోల్సోనారో మద్దతుదారులు పార్లమెంటు, సుప్రీంకోర్టు , అధ్యక్ష భవనంపై దాడి చేశారు. ‘ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది’, ‘ఫాసిజం, వర్ణవివక్షకు వ్యతిరేకంగా కలిసి నిలబడండి’ అనే నినాదాలతో నిరసన చేపట్టారు. నిరసనకారులు ఇజ్రాయెల్ జాతీయ జెండా, ఇంద్రధనస్సు జెండాలతో వీధుల్లోకి వచ్చారు. ‘క్రెమ్ మినిస్టర్’ అంటూ నెతన్యాహుకు వ్యతిరేకంగా బ్యానర్లను నిరసనకారులు ప్రదర్శించారు.
Read Also: Employees Layoffs : ఇక గోల్డ్ మాన్ వంతు.. 3200ఉద్యోగాలకు కోత
నవంబర్ 2022 ఎన్నికలలో నెతన్యాహు ఇజ్రాయెల్ అధ్యక్ష పదవిని గెలుచుకున్నారు. డిసెంబర్ చివరిలో అధికారం చేపట్టారు. తీవ్ర మితవాద పార్టీలు, సంప్రదాయవాద జ్యూయిష్ పార్టీ మద్దతుతో అధికారంలోకి వచ్చిన నెతన్యాహు క్యాబినెట్‌లో వారికి ముఖ్యమైన పదవులు కట్టబెట్టారు. ఇదే నిరసనలకు దారి తీసింది. పన్ను ఎగవేతకు పాల్పడిన వారికి, పాలస్తీనా విశ్వాసులను ఊచకోత కోసిన ఉగ్రవాదిని ఆరాధించిన వారికి నెతన్యాహు మంత్రివర్గంలో చోటు దక్కింది. ఇజ్రాయెల్‌లో సుదీర్ఘకాలం పాలించిన నెతన్యాహు కూడా అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఇజ్రాయెల్ ప్రజాస్వామ్యం అంతరించిపోతోందని నిరసనకారులు ఆరోపించారు. ఉగ్రవాదులు తమ ఆలోచనలను దేశంపై రుద్దుతున్నారని, ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో మితవాద పార్టీల నిర్ణయాలు దేశంలోని మెజారిటీ ప్రజల నిర్ణయాలు కాదని వారు ఆరోపించారు.