NTV Telugu Site icon

The Pope Emeritus Benedict XVI : పోప్ బెన‌డిక్ట్‌కు తుది వీడ్కోలు

Pope22

Pope22

The Pope Emeritus Benedict XVI : గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ పోప్ ఎమిరిటస్ బెనెడిక్ట్ XVI ఇటీవలే కన్ను మూశారు. ఆయన వయసు 95 ఏళ్లు. ఇక ఆయన మరణానికి సంబంధించిన అధికారిక సమాచారం వాటికన్ సిటీ నుంచి వెలువడింది. మాజీ పోప్ ఎమెరిటస్ గత కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్నారు . కాథలిక్ క్రైస్తవులు అందరూ తమ చీఫ్ గా పోప్ ను భావిస్తారు.

Read Also: Viral : సోషల్ మీడియాలో కంటతడి పెట్టిస్తోన్న ఆరేళ్ల క్యాన్సర్ చిన్నారి కథనం

మాజీ పోప్ బెనెడిక్ట్ అంత్యక్రియలు వాటికన్ లోని సెయింట్ పీటర్స్ స్క్వేర్ లో జరుగుతున్నాయి. 60వేల మంది ప్రజలు అంత్యక్రియలకు హాజరై సంతాపం తెలిపారు. క్యాథలిక్ సంప్రదాయ పద్ధతిలో జరుగుతున్న అంత్యక్రియల్లో పోప్ ఫ్రాన్సిస్ మాట్లాడారు. జీసస్ చివరి పదాల్లోంచి.. ‘తండ్రీ.. నీ హస్తాలకు నా ఆత్మను అప్పగిస్తున్నాను’ అని పోప్ ఫ్రాన్సిస్ చెప్పారు.

Read Also: Lover Attack : పెళ్లి చేసుకోమని విసిగించింది.. ప్రియురాలిని తగులబెట్టాడు

బెనెడిక్ట్ XVI జీవితాన్ని దేవుడికి అప్పగించడానికి ఇంత మంది ప్రజలు వచ్చారని వ్యాఖ్యానించారు. ఇది వారి అపారప్రేమను సూచిస్తోందని చెప్పారు. కాగా, బెనెడిక్ట్ అనారోగ్య కారణాలతో ఇటీవల క్రితం కన్నుమూసిన విషయం తెలిసిందే. సుమారు పదేళ్ల క్రితం బెనెడిక్ట్ XVI పోప్ హోదాకు రాజీనామా చేశారు. ఆయన 2005, ఏప్రిల్ 19 నుంచి 2013 ఫిబ్రవరి 28 వరకు పోప్ గా కొనసాగారు.

Show comments