విశ్వనటుడు కమల్ హాసన్ “విక్రమ్”సినిమాతో పవర్ ఫుల్ కంబ్యాక్ ఇచ్చారు..ప్రస్తుతం కమల్ హాసన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు..కమల్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాలలో ఒకటి ‘థగ్ లైఫ్’. కమల్ హాసన్ 234 వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ చిత్రానికి లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు..ఈ సినిమాలో శింబు, ఐశ్వర్యలక్ష్మి, గౌతమ్ కార్తీక్, జోజు జార్జ్ మరియు త్రిష ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అయితే కోలీవుడ్ స్టార్ హీరోలు అయిన దుల్కర్ సల్మాన్ మరియు జయం రవి ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి.తాజాగా ఆ ఇద్దరు స్టార్ యాక్టర్ల డేట్స్ సర్దుబాటు కావడంతో థగ్ లైఫ్‌లో మళ్లీ రీ జాయిన్ కాబోతున్నారన్న వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
అలాగే శింబు ఈ సినిమాలో డ్యుయల్ రోల్‌లో కనిపించోతున్నాడని సమాచారం..ప్రస్తుతం శింబు నటిస్తోన్న STR48 మరింత ఆలస్యం కానుందని సమాచారం.దీనితో STR48 మొదలు అయ్యేలోగా శింబు థగ్ లైఫ్‌ను పూర్తి చేయనున్నాడని తెలుస్తుంది. ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.. థగ్ లైఫ్ మూవీని కమల్ హాసన్-ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ మరియు రెడ్ జియాంట్ మూవీస్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.కమల్ హాసన్ ఈ సినిమాతో పాటు తెలుగులో ప్రభాస్ హీరోగా నటిస్తున్న “కల్కి 2898Ad” సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.. ఆ సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తి అయింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
