రౌడీ హీరో విజయ్ దేవరకొండ, పరుశురాం కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ‘ఫ్యామిలీ స్టార్ ‘.. గతంలో వచ్చిన గీతాగోవిందం సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఇప్పుడు వస్తున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఏర్పడ్డాయి.. కుటుంబ బంధాలకు ప్రేమకథను జోడించి పరశురామ్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమా ఏప్రిల్ 5 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది..
ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని అప్డేట్స్ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి.. దాంతో రౌడీ హీరో ఫ్యాన్స్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.. అయితే ఈ సినిమాలో రష్మిక మందన్న కూడా గెస్ట్ రోల్ చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక ఇటీవల చిత్ర నిర్మాత దిల్ రాజు మాత్రం ఆమె చిన్న రోల్ చేస్తుందని హింట్ ఇచ్చాడు.. ఇంతకీ ఆమె నిజంగానే సినిమాలో నటిస్తుందా? లేదా? అనేది తెలియాలంటే థియేటర్లలో చూడాలని క్యూరియాసిటీ కలిగించారు.
ఇదిలా ఉండగా ఫ్యామిలీ స్టార్‌లో రష్మిక మందన్న చాలా చిన్న రోల్ చేసినట్లు సమాచారం.. చాలా చిన్న రోల్ చేసిందట.. ఆమె పాత్ర కేవలం ఐదు నిమిషాల లోపే ఉంటుందని తెలుస్తుంది.. అమెరికా బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సీన్స్‌లో రష్మిక మందన్న కనిపించనున్నట్లు చెబుతున్నారు.. ఆమె రోల్ ఆడియన్స్ ను సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు.. ఏది ఏమైనా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మాత్రం ఇద్దరు ఒకే స్క్రీన్ పై కనిపిస్తున్నారన్న వార్తలు విని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.. ఇక ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే రేపటివరకు వెయిట్ చెయ్యాల్సిందే..
