Island For Sale: స్కాట్లాండ్ తీరంలోని జనావాసాలు లేని ద్వీపం అమ్మకానికి ఉది. దాదాపు 25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బార్లోకో ద్వీపం డంప్రైస్ పట్టణానికి దాదాపు ఆరు మైళ్ల దూరంలో ఉంది. ఈ ద్వీపంలో చెరువుతో పాటు గులకరాయి బీచ్ కూడా ఉంది. దీనికి కాలినడకన కూడా చేరుకోవచ్చు. తక్కువ ఆటు పోట్లు ఉండడం వల్ల ఇక్కడ పడవలను లంగరు కూడా వేయొచ్చు.
Read Also: Notice to Sweeper: బ్యాంక్ అకౌంట్ కూడా లేదట.. కానీ రూ.16 కోట్ల రుణం చెల్లించాలని నోటీసులు
ఈ ద్వీపం పచ్చని గడ్డి, సముద్రం వరకు విస్తరించి ఉన్న రాళ్లతో మంచి ప్రకృతి అందాలను కలిగి ఉంది. ఈ ప్రాంతం కొన్ని అతిపెద్ద సముద్ర పక్షుల కాలనీలను కలిగి ఉంది. ఇది అన్ని రకాల వన్యప్రాణులకు నిలయంగా ఉంది. రాక్ సీ లావెండర్, సువాసనగల ఆర్చిడ్ వంటి అరుదైన మొక్కలకు కూడా నిలయం.ఈ ద్వీపం ఫ్లీట్ దీవులలో ఒకటి. ఈ ద్వీపం విక్రయాన్ని నిర్వహిస్తున్న గాల్‌బ్రైత్ ప్రకారం, ఎవరైనా తమ సొంత ద్వీపాన్ని సొంతం చేసుకోవడం అరుదైన అవకాశంగా పేర్కొంది. సమీప పట్టణం ఆరు మైళ్ల దూరంలో ఉంది. సమీప రైలు స్టేషన్‌కు చేరుకోవడానికి రోడ్డు మార్గంలో గంట పడుతుంది. లండన్, ఎడిన్‌బర్గ్‌లు వరుసగా 350 మరియు 100 మైళ్ల దూరంలో ఉన్నాయి. ద్వీపంలో నిర్మాణానికి అనుమతి కోసం ఎవరూ దరఖాస్తు చేసుకోలేదని, కాబట్టి స్థానిక అధికారంతో అభివృద్ధి సాధ్యాసాధ్యాలను పరిశీలించడం కొనుగోలుదారుపై ఉంటుందని నివేదిక పేర్కొంది.