Site icon NTV Telugu

CM Jagan: సీఎం జగన్ రేపటి పర్యటన షెడ్యూల్ ఇదే

Jagan

Jagan

CM Jagan: సీఎం వైఎస్‌ జగన్‌ రేపు విజయవాడలో పర్యటించనున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ నరేందర్‌ ప్రమాణం కార్యక్రమంలో పాల్గొననున్నారు. సీఎం జగన్ సాయంత్రం 4.47 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి రాజ్‌భవన్‌ చేరుకోనున్నారు. అనంతరం కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఇదిలా ఉంటే.. జస్టిస్ జి. నరేందర్ కర్ణాటక హైకోర్టు నుంచి బదిలీపై ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా వస్తున్నారు.

Read Also: Suriya: ఢిల్లీ ఎప్పుడు వస్తాడో.. రోలెక్స్ కూడా తిరిగి వస్తాడు

మరోవైపు నవంబర్‌ 1న కూడా విజయవాడలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి. వైయస్సార్‌ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డులు, ఎచీవ్‌మెంట్‌ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో గవర్నర్, సీఎం పాల్గొననున్నారు. ఉదయం 10.48 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి.. విజయవాడ ఎ- కన్వెన్షన్‌ సెంటర్‌కు చేరుకోనున్నారు. ఆ తర్వాత అవార్డుల ప్రదాన కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు.

Read Also: Bhatti Vikramarka: తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌తోనే ప్రజల కలలు సాకారం..

Exit mobile version