Site icon NTV Telugu

Reliance: రిలయన్స్ కంపెనీలో అంబానీ కన్నా ఆ ఉద్యోగికి రూ.9 కోట్లు సాలరీ ఎక్కువ

Ambani

Ambani

Reliance: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడని అందరికీ తెలిసిందే. ఏటా ఆయన సంపాదన వేలకోట్లు ఉంటుంది. అంత సంపాదించిన ఆయన తన కంపెనీలో పని చేసే ఉద్యోగులకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తారు. ముఖేష్ అంబానీ తన పాత సహోద్యోగి, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉద్యోగి మనోజ్ మోడీకి రూ.1500 కోట్ల రూపాయల విలువైన ఇంటిని బహుమతిగా ఇచ్చారని ఇటీవల వార్తలో చదివాం. తాజా తన కంపెనీలోనే పనిచేస్తున్న ఓ ఉద్యోగి కుమార్తె పెళ్లి కూడా తన ఇంట్లో చేశాడనే వార్త ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది.

Read Also:Karnataka CM: కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య.. ఈ నెల 20న ప్రమాణస్వీకారం

రిలయన్స్ కంపెనీలో కొంత మంది ఉద్యోగుల వేతనం ముఖేష్ అంబానీ జీతం కంటే ఎక్కువ.. ఇదేంటి అని ఆశ్చర్యపోతున్నారా కానీ ఇదే నిజం. అలాంటి ఒక ఉద్యోగి ఉన్నారు. అతని జీతం ముఖేష్ అంబానీ సంవత్సర వేతనం కంటే రూ.9 కోట్లు ఎక్కువ. రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్రోకెమికల్ వ్యాపారానికి నేతృత్వం వహిస్తున్న నిఖిల్ మెస్వానీ అనే వ్యక్తికి ఈ గౌరవం దక్కింది. నిఖిల్ ఎవరో కాదు స్వయానా ముఖేశ్ అంబానీకి మేనల్లుడు. నిఖిల్ మెస్వానీ తండ్రి రసిక్లాల్ మెస్వానీ రిలయన్స్ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. అతను రిలయన్స్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీకి దగ్గరి బంధువు. రిలయన్స్ పెట్రోకెమికల్ విజయం వెనుక నిఖిల్ ఉన్నారు. ఇదే కాకుండా, నిఖిల్ IPL క్రికెట్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ నిర్వహణను చూస్తున్నాడు. 1986నుంచి నిఖిల్ రిలయన్స్‌తో అనుబంధం కలిగి ఉన్నాడు. దాదాపు అతను గత 37 సంవత్సరాలుగా కంపెనీలో పని చేస్తున్నాడు. అతని అన్న హితల్ మెస్వానీ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. నిఖిల్ రిలయన్స్ పెట్రోకెమికల్స్‌లో ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు. 1998లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 1997 , 2005 మధ్య, రిఫైనరీ వ్యాపారాన్ని పెద్దదిగా చేయడానికి నిఖిల్ పగలు, రాత్రి ఏకమయ్యాడు. ఇది కాకుండా, అతను రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్‌లో కూడా పాత్ర పోషించాడు.

Read Also:Janasena: గాజు గ్లాసు గుర్తు కోల్పోయిన జనసేన.. ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చిన ఈసీ

ఫోర్బ్స్ ప్రకారం దశాబ్ద కాలంగా ఎలాంటి ఇంక్రిమెంట్ తీసుకోకుండా ముఖేష్ అంబానీ రూ.15 కోట్లు జీతం తీసుకుంటున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో నిఖిల్ మెస్వానీ జీతం రూ. 24 కోట్లు. అంటే అంబానీ కంటే నిఖిల్ జీతం రూ.9 కోట్లు ఎక్కువ. విశేషమేమిటంటే, కోవిడ్ మహమ్మారి సమయంలో, ముఖేష్ అంబానీ ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోలేదు. నిఖిల్ ముంబై విశ్వవిద్యాలయం నుండి కెమికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందాడు. ఆ తర్వాత తదుపరి చదువుల కోసం అమెరికా వెళ్లాడు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, అతను రిలయన్స్‌లో చేరాడు. 2016లో నిఖిల్ ఫోర్బ్స్ చేత ప్రపంచంలోని 100 అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో చేరాడు.

Exit mobile version