NTV Telugu Site icon

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో ఎనిమిదో రోజు భారత్ షెడ్యూల్ ఇదే..

Olampics 8th Day

Olampics 8th Day

పారిస్ ఒలింపిక్స్‌లో ఎనిమిదో రోజు (శనివారం) మహిళా షూటర్ మను భాకర్ పై మరోసారి పతకంపై భారత్ ఆశలు పెట్టుకుంది. నేడు మను 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో ఫైనల్‌లో విజయం సాధించి పారిస్ గేమ్స్‌లో హ్యాట్రిక్ పతకాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మను భాకర్.. భారతదేశానికి ఇప్పటివరకు రెండు కాంస్య పతకాలు సాధించిపెట్టింది. ఆమె తన మూడవ ఒలింపిక్ పతకాన్ని గెలుచుకోవడమే కాకుండా ఈసారి తన అదృష్టం కూడా మారుస్తుందనే ఆశ ఉంది.

మహిళా ఆర్చర్ దీపికా కుమారి కూడా వ్యక్తిగత విభాగంలో సవాల్‌ను ప్రదర్శించనున్నారు. ప్రిక్వార్టర్స్‌లో ఆమె జర్మనీకి చెందిన మిచెల్ క్రోపెన్‌తో తలపడనుంది. అదే సమయంలో మరో మహిళా ఆర్చర్ భజన్ కౌర్ కూడా ప్రిక్వార్టర్‌లో సవాల్‌ విసిరింది. ఈరోజు రాత్రి.. 71 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్లో బాక్సర్ నిశాంత్ దేవ్ మార్క్ వెర్డేతో తలపడనున్నాడు. ఈ మ్యాచ్‌లో నిశాంత్ విజయం సాధిస్తే కాంస్య పతకం ఖాయం.

పారిస్ ఒలింపిక్స్‌లో ఎనిమిదో రోజు భారత్ షెడ్యూల్..

షూటింగ్
పురుషుల స్కీట్ క్వాలిఫికేషన్ (2వ రోజు): అనంత్ జీత్ సింగ్ నరుకా
మహిళల స్కీట్ క్వాలిఫికేషన్ (1వ రోజు): రీజా ధిల్లాన్ మరియు మహేశ్వరి చౌహాన్ (మధ్యాహ్నం 12.30 నుంచి)
మహిళల 25 మీ పిస్టల్ ఫైనల్: మను భాకర్ (1:00 pm)

గోల్ఫ్
పురుషుల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే (రౌండ్ 3): శుభంకర్ శర్మ, గగన్‌జీత్ భుల్లర్ (12:30 pm)

ఆర్చరీ
మహిళల వ్యక్తిగత (1/8 ఎలిమినేషన్): దీపికా కుమారి Vs మిచెల్ క్రోపెన్ (జర్మనీ) (మధ్యాహ్నం 1.52 నుండి)
మహిళల వ్యక్తిగత (1/8 ఎలిమినేషన్): భజన్ కౌర్ వర్సెస్ దియాండా కొయిరునిసా (ఇండోనేషియా) (మధ్యాహ్నం 2.05 నుండి)

సెయిలింగ్
పురుషుల డింగీ (రేసు ఐదు): విష్ణు శరవణన్ (3.45pm)
పురుషుల డింగీ (రేసు ఆరు): విష్ణు శరవణన్ (సాయంత్రం 4.53 నుంచి)
మహిళల డింగీ (రేసు ఐదు): నేత్ర కుమనన్ (సాయంత్రం 5.55 నుంచి)
మహిళల డింగీ (రేసు ఆరు): నేత్ర కుమనన్ (సాయంత్రం 7.03 నుంచి )

బాక్సింగ్
పురుషుల 71 కేజీల క్వార్టర్- ఫైనల్: నిశాంత్ దేవ్ vs మార్కో వెర్డే (మెక్సికో) (మధ్యాహ్నం 12.18 నుండి)