NTV Telugu Site icon

Highway: ఒక్క మలుపు కూడా లేని 256 కి.మీ హైవే.. ఎక్కడో తెలుసా..?

Highway

Highway

హైవేలపై వెళ్తుంటే మలుపులు వచ్చిన దగ్గరి కాస్త స్లో చేసుకుని వెళ్తాం. అలాంటప్పుడు కాస్త చిరాకు అనిపిస్తుంది. ఎందుకంటే.. మంచి స్పీడ్ లో వచ్చి, మళ్లీ స్లో అయితే గేర్లు మార్చాలి.. మళ్లీ పికప్ అందుకోవడానికి సమయం పడుతుంది. అందుకే డ్రైవింగ్ చేసే వాళ్లు చిరాకెత్తిపోతారు. అదే.. చక్కటి రోడ్డు ఉంటే, హ్యాపీగా బ్రేక్ మీద కాలుపెట్టకుండా, గేర్లు మార్చకుండా వెళ్లొచ్చు. అయితే.. మలుపులు లేని రోడ్లు ఎక్కడో చోట కొంత దూరం ఉంటాయి, కానీ.. సౌధీ అరేబియాలో మాత్రం 256 కి.మీ మలుపులు లేని నిటారుగా ఒక హైవే ఉంది.

Jogi Ramesh: సంబరాలకు సిద్ధం కండి.. గెలిచేది మనమే..

ఈ రహదారిని రబ్ అల్ ఖలీ ఎడారి మీదుగా నిర్మించారు. హైవే 10లో ఏకంగా 256 కిలోమీటర్ల దూరం వరకు ఒక్క మలుపు కూడా లేదు. హరద్ నుంచి యూఏఈ సరిహద్దు ప్రాంతం అల్బతా వరకు ఎక్కడ కూడా మలుపులు లేవని అరబ్ న్యూస్ సంస్థ తెలిపింది. కాగా.. ఇప్పటివరకు ఆస్ట్రేలియాలోని ఐర్ హైవే (146 కి.మీ.) ఉండేది. ఇప్పుడు దాని రికార్డును హైవే 10 బద్దలు కొట్టినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది.

Sandeep Lamichhane: రేప్ కేసులో నేపాల్ క్రికెటర్కు ఊరట.. నిర్దోషిగా తేల్చిన హైకోర్టు

దేశ రాజు అబ్దుల్లా కోసం మొదట దీన్ని ప్రైవేటు రోడ్డుగా స్పెషల్ గా నిర్మించుకోగా.. అయితే ఇప్పుడు మాత్రం చమురు రవాణాకు వాడుతున్నారు. ఈ రహదారి నిటారుగా ఉండటమే కాదు.. ఎక్కడా కూడా ఎత్తుపల్లాలు లేవని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ తెలిపింది. అంతేకాకుండా.. ఈ దారి వెంబడి ఎక్కడా ఒక్క చెట్టు, నిర్మాణాలు లేవు. ఈ రోడ్డుపై వెళ్లే వాహనాలు కేవలం 2 గంటల్లోనే 256 కి.మీ దూరం వెళ్లనున్నాయి. అయితే.. అప్పుడప్పుడు ఒంటెలు, కంగారులు రోడ్డు దాటుతుంటాయని.. వాహనదారులు జాగ్రత్తగా నడపాలని dangerousroads.org అనే వెబ్సైట్ తెలిపింది.