Thief Pray God: ఓ దొంగ దర్జాగా కారులో గుడికెళ్లి.. దేవుడిని భక్తితో ప్రార్థించి మరీ హుండీని ఎత్తుకెళ్లాడు. ఈ వింత దొంగతనం మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో చోటుచేసుకుంది. సరిగ్గా దీపావళి రోజు ఈ చోరీ జరిగింది. అందరూ దీపావళి వేడుకల్లో మునిగి ఉండగా.. ఆ దొంగ తన పనిని సులభంగా కానిచ్చాడు. అర్థరాత్రి రెండు గంటల సమయంలో కారులో గౌర్ చౌకీలోని హనుమాన్ ఆలయానికి వచ్చిన దొంగ.. ఆలయం బయట చెప్పులు వదలిపెట్టి లోపలికి ప్రవేశించాడు. ముందుగా దేవుడికి ప్రార్థన చేశాడు. ఆ తర్వాత లోపలికి వెళ్లి హుండీని ఎత్తుకెళ్లాడు. సీసీటీవీలో నమోదైన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
Ration Mafia: రూట్ మార్చిన రేషన్ మాఫియా.. రైళ్లలో సరిహద్దులు దాటుతోన్న బియ్యం..!
తెల్లవారుజామున ఓ భక్తుడు ఆలయానికి వెళ్లగా విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులకు విషయాన్ని తెలియజేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు ఆ వీడియోను చూసి మొదట బిత్తరపోయారు. దేవుడి పట్ల అంత భక్తి చూపిస్తూ ఇలా చోరీ చేయడం పట్ల ఆశ్చర్యపోయారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగను గుర్తించి అరెస్ట్ చేసేందుకు గాలింపు చేపట్టారు. గతంలో కూడా ఇదే తరహాలో చోరీ జరిగిందని పోలీసులు వెల్లడించారు.
