దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచు వల్ల చల్లని గాలులు వీస్తున్నాయి. దీని వల్ల ఢిల్లీ ప్రజలు గజగజ వణికిపోతున్నారు. అయితే, పొగమంచు వల్ల విజిబిలిటీ తక్కువగా ఉంది.. ఈ పొగమంచు వల్ల పలు రైళ్లు రాకపోకలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇప్పటికే 17 విమానాలను క్యాన్సిల్ అయ్యాయి. విమాన సర్వీసుల ఆలస్యం, రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక రైల్వే స్టేషన్ ల్లోనూ ప్రయాణికులు రద్దీ ఎక్కువగా కొనసాగుతుంది.
Read Also: PM Modi: నేడు ఏపీ పర్యటనకు ప్రధాని మోడీ.. పూర్తి షెడ్యూల్ ఇదే..
ఇక, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, చండీగఢ్, పంజాబ్‌లలో దట్టమైన పొగమంచు తీవ్రంగా కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొనింది. అంతే కాకుండా, ఉత్తర భారతదేశం అంతటా తీవ్రమై చల్లని గాలులు వీస్తున్నాయి. అయితే, ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ లో 3.3 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. లోధి రోడ్‌లో 3.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయింది.