NTV Telugu Site icon

TIME Magazine Best Places : ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల జాబితాలో మయూర్‌భంజ్, లడఖ్

Best Places

Best Places

TIME Magazine Best Places : టైమ్‌ మ్యాగజైన్ 2023 సంవత్సరానికి గానూ తాజాగా వెల్లడించిన ప్రపంచంలోని 50 గొప్ప ప్రదేశాల జాబితాలో మయూర్‌భంజ్, లడఖ్‌లు చోటు సంపాదించాయి. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు.. పర్యాటకం, కొత్త మానవ సంబంధాల ద్వారా ఉత్సాహం లభిస్తుంది. 2023లో అన్వేషించాల్సిన అసాధారణ గమ్యస్థానాలు ఇవేనంటూ ఈ ప్రదేశాల గురించి టైమ్‌ వివరించింది. 2023లో పర్యాటక పరిశ్రమ తిరిగి పూర్తి స్వింగ్‌లో ఉందని పేర్కొంది. ప్రపంచంలోని 50 గొప్ప ప్రదేశాల జాబితాలో రెండు భారతీయ ప్రదేశాలు ఉన్నాయి. అవి మయూర్‌భంజ్, లడఖ్. అరుదైన పులులు, పురాతన దేవాలయాలు, సాహసాలు, తినుబండారాల కోసం ఎంపిక చేయబడ్డాయి. టైమ్ మ్యాగజైన్ లడఖ్, మయూభంజ్ కోసం ప్రొఫైల్ పేజీలను సృష్టించింది. ఇక్కడ ఈ స్థలాలు దాని ప్రతిష్టాత్మక జాబితాలో ఎందుకు భాగమయ్యాయో కారణాలను హైలైట్ చేసింది.

లడఖ్: ఆశ్చర్యపరిచే ఆల్పైన్ ల్యాండ్‌స్కేప్‌లు, టిబెటన్ బౌద్ధ సంస్కృతితో, ఉత్తర భారతదేశంలోని అత్యంత సుదూర ప్రాంతమైన లడఖ్ అనేక అద్భుతమైన అందాలను కలిగి ఉందని టైమ్ మ్యాగజైన్ పేర్కొంది. 2023లో లడఖ్ రాజధాని లేహ్‌కు ఆగ్నేయంగా 168మైళ్ల దూరంలో ఉన్న హన్లే గ్రామంలో భారతదేశం తన మొదటి డార్క్ స్కై రిజర్వ్‌ను ఏర్పాటు చేసింది. ఈ లఢక్‌లోని ఛాంగ్‌థాంగ్ కోల్డ్ డెసెర్ట్ వైల్డ్‌లైఫ్ శాంక్యురీలో.. డార్క్ స్కై రిజర్వు ఏర్పాటైంది. ఇలాంటిది ఇండియాలో ఇదే మొదటిది. దీన్ని నైట్ స్కై శాంక్చురీ అని కూడా పిలుస్తున్నారు. ఇది సముద్ర మట్టానికి 4,500 మీటర్ల ఎత్తులో ఉంటుంది. హాన్ లే గ్రామం (6 చిన్న గ్రామాల సమూహం)లో ఈ రిజర్వ్ ఉంది.

మయూర్‌భంజ్: పచ్చని ప్రకృతి దృశ్యం, సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం, పురాతన దేవాలయాలకు ప్రసిద్ధి చెందిన ఒడిశాలోని మయూర్‌భంజ్ జాబితాలో రెండవ భారతీయ ప్రదేశం. మయూర్‌భంజ్ చాలా అరుదైన నల్లపులి కనిపించే భూమిపై ఉన్న ఏకైక ప్రదేశం ఇదేనని పత్రిక పేర్కొంది. ప్రసిద్ధ సిమిలిపాల్ నేషనల్ పార్క్ మాత్రమే కాకుండా ఈ జిల్లాలో చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి.

2023లో ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల పూర్తి జాబితా ఇదే..

1. టంపా, ఫ్లోరిడా

2. విల్లామెట్ వ్యాలీ, ఒరెగాన్

3. రియో గ్రాండే, పి.ఆర్.

4. టక్సన్, అరిజోనా

5. యోస్మైట్ నేషనల్ పార్క్, కాలిఫోర్నియా

6. బోజ్మాన్, మోంటానా

7. వాషింగ్టన్ డీసీ

8. వాంకోవర్

9. చర్చిల్, మానిటోబా

10. డిజోన్, ఫ్రాన్స్

11. పాంటెల్లెరియా, ఇటలీ

12. నేపుల్స్, ఇటలీ

13. ఆర్హస్, డెన్మార్క్

14. సెయింట్ మోరిట్జ్, స్విట్జర్లాండ్

15. బార్సిలోనా

16. టిమిసోరా, రొమేనియా

17. సిల్ట్, జర్మనీ

18. బెరాట్, అల్బేనియా

19. బుడాపెస్ట్

20. వియన్నా

21. బ్రిస్బేన్, ఆస్ట్రేలియా

22. కంగారూ ద్వీపం, ఆస్ట్రేలియా

23. డొమినికా

24. మెక్సికో సిటీ

25. గ్వాడలజారా, మెక్సికో

26. టోర్రెస్ డెల్ పైన్ నేషనల్ పార్క్, చిలీ

27. పాంటనాల్, బ్రెజిల్

28. మెడెలిన్, కొలంబియా

29. ఒల్లంటాయ్టాంబో, పెరూ

30. రోటన్, హోండురాస్

31. లడఖ్, భారతదేశం

32. మయూర్‌భంజ్, భారతదేశం

33. క్యోటో

34. నగోయా, జపాన్

35. ఇసాన్, థాయిలాండ్

36. ఫుకెట్, థాయిలాండ్

37. జెజు ద్వీపం, దక్షిణ కొరియా

38. లుయాంగ్ ప్రబాంగ్, లావోస్

39. గిజా మరియు సఖారా, ఈజిప్ట్

40. చ్యులు హిల్స్, కెన్యా

41. ముసాంజే, రువాండా

42. రబాత్, మొరాకో

43. డాకర్, సెనెగల్

44. లోయాంగో నేషనల్ పార్క్, గాబన్

45. ఫ్రీటౌన్ పెనిన్సులా, సియెర్రా లియోన్

46. ఎర్ర సముద్రం, సౌదీ అరేబియా

47. అకాబా, జోర్డాన్

48. జెరూసలేం

49. షార్జా, యూఏఈ

50. టమోటూ ద్వీపసమూహం, ఫ్రెంచ్ పాలినేషియా

గతేడాది ప్రపంచంలోని 50 గొప్ప ప్రదేశాల జాబితాలో అహ్మదాబాద్‌ నగరం, కేరళ రాష్ట్రం చోటు సంపాదించాయి.ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల జాబితాను తయారు చేయడానికి, మ్యాగజైన్ తన అంతర్జాతీయ నెట్‌వర్క్ కరస్పాండెంట్లు, కంట్రిబ్యూటర్ల ద్వారా పర్యాటక ప్రేమికుల నుంచి నామినేషన్లను అభ్యర్థించింది.