NTV Telugu Site icon

World Oral Health Day : ఇవి తింటే డెంటల్ డాక్టర్‎తో పనే లేదు

New Project (24)

New Project (24)

World Oral Health Day : గుండె, చర్మం, రోగనిరోధక వ్యవస్థ, రక్తంలో చక్కెర స్థాయిలు చాలా ముఖ్యమైనవి అని చాలా మంది నమ్ముతారు. కానీ నోటి సంరక్షణ నోటి ఆరోగ్యానికి పెద్దగా శ్రద్ధ చూపరు. నోటి శుభ్రతను పట్టించుకోకపోతే నోటి నుంచి దుర్వాసన, పంటి నొప్పి, చిగుళ్ల నుండి రక్తం ఇతర దంతాల సమస్యలు సంభవించవచ్చు. వరల్డ్ ఓరల్ హెల్త్ డేను ప్రతి సంవత్సరం మార్చి 20 న జరుపుకుంటారు. ప్రపంచ నోటి సంరక్షణ దినోత్సవం సందర్భంగా దంతాలు ఆరోగ్యంగా, బలంగా ఉండటానికి కొన్ని సూచనలు పాటించాలి. నోటి పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇవ్వాలని డాక్టర్లు సూచించారు. శుభ్రత మాత్రమే కాకుండా.. పోషకాహారం కూడా దంతాలను ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదం చేస్తుంది. నోటి ఆరోగ్యాన్ని ఏ ఆహారాలు మెరుగుపరుస్తాయో తెలుసుకుందాం. సరైన ఆహారం తీసుకోకపోతే చెడు బ్యాక్టీరియా చేరి నోటి సమస్యలు తలెత్తుతాయి. చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచి ప్రతీ ఒక్కరూ దంత సంరక్షణ చర్యలు పాటించాలి.

Read Also: Good News From KCR: ముస్లింలకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్

ఆపిల్ : అందుకే పెద్దలు అంటారు రోజుకో ఆపిల్ తింటే ఆస్పత్రికి వెళ్లే అవసరం రాదని.. నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఆపిల్ ప్రభావవంతంగా పనిచేస్తుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన ఆపిల్ కూడా దంతాలను శుభ్రం చేయడానికి పనికొస్తుంది. ఆపిల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా అందులో ఉండే మాలిక్ ఆమ్లం నోటి నుండి బ్యాక్టీరియాను తొలగించే లాలాజల ఉత్పత్తిని పెంచుతుంది.
పాలు, జున్ను : పాల ఉత్పత్తుల్లో కాల్షియం పుష్కలంగా ఉంది. దంతాలను ఆరోగ్యంగా ఉంచడానికి ఇది సహాయపడుతుంది. పాల ఉత్పత్తులలో అధిక ప్రోటీన్ నాణ్యత కారణంగా ఇది నోటిలో ఆమ్ల స్థాయిని తగ్గిస్తుంది.
నీరు : మీ శరీరానికి ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కువ నీరు త్రాగటం వల్ల లాలాజలాలను బాగా ఉత్పత్తి చేస్తుంది. ఇది నోటిలోని బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. అందువల్ల, ప్రతి వ్యక్తి ప్రతిరోజూ కనీసం 2 నుండి 3 లీటర్ల నీరు తాగాలి.

Show comments