2024 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఆటో కార్ల తయారీ కంపెనీలు అనేక గొప్ప కార్లను లాంచ్ చేశాయి. అందులో ఎలక్ట్రిక్ కార్లు, హైబ్రిడ్, పెట్రోల్-డీజిల్ ఇంజిన్ కార్లు ఉన్నాయి. ఈ ఏడాదిలో కొన్ని కంపెనీల కార్లు.. అద్భుతంగా విక్రయాలు జరిగితే, మరికొన్ని కార్లకు డిమాండ్ లేకుండా పోయింది. ఈ సంవత్సరం విడుదలైన కార్లలో ఎక్కువగా ఇష్టపడటం, పేరు పొందిన కార్ల గురించి తెలుసుకుందాం…….
Read Also: Harish Rao : సమగ్ర శిక్ష ఉద్యోగులను నిర్బంధించడం పట్ల హరీష్ రావు ఫైర్
1. పోర్స్చే టేకాన్ టర్బో S
వేగం: కేవలం 2.4 సెకన్లలో 0-100 కిమీ/గం.
గరిష్ట వేగం: 260 km/h
0-200 కిమీ/గం: 7.7 సెకన్లలో.
పోర్స్చే టేకాన్ టర్బో S.. 2024లో విడుదలైన కార్లలో అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కారుగా పేరు పొందింది. ఇది 105 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఈ కారు 775 PS శక్తిని, 1,110 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ తర్వాత 568-630 కిలోమీటర్ల పరిధిని ఇస్తుంది.
2.మెక్‌లారెన్ 750S
వేగం: కేవలం 2.8 సెకన్లలో 0-100 కిమీ/గం.
0-200 కిమీ/గం: 7.2 సె.
గరిష్ట వేగం: 332 కిమీ/గం.
మెక్‌లారెన్ 750S.. అత్యంత వేగవంతమైన స్పోర్ట్స్ కార్లలో ఒకటి. ఇది 4-లీటర్ ట్విన్-టర్బో V8 ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు 750 PS శక్తిని, 800 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ కారు ఇంజన్ 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అటాచ్ చేశారు. ఈ కారు వెనుక చక్రాల డ్రైవ్ సిస్టమ్ ద్వారా ట్రాక్‌లో స్థిరత్వాన్ని పొందుతుంది.
3. Mercedes-AMG S63 E
వేగం: కేవలం 3.3 సెకన్లలో 0-100 కిమీ/గం.
గరిష్ట వేగం: 250 km/h.
ఈ కారు అద్భుతమైన హైబ్రిడ్ టెక్నాలజీతో లాంచ్ చేశారు. ఈ కారు V8 ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటుంది. ఇది అద్భుతమైన పవర్‌ను జనరేట్ చేస్తుంది. ఈ కారులో 2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్, చిన్న బ్యాటరీ ప్యాక్ అందించారు. ఈ రెండూ కలిసి 802 PS శక్తిని, 1,430 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ కారు ఇంజన్ ఎలక్ట్రిక్ మోటార్ లేకుండా 612 PS శక్తిని, 900 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
4.BMW M4 CS
వేగం: కేవలం 3.4 సెకన్లలో 0-100 కిమీ/గం.
200 కిమీ/గం వరకు: 11.1 సెకన్లలో.
గరిష్ట వేగం: 302 కిమీ/గం.
ఇది స్పోర్ట్స్ కారు. త్వరగా స్పీడ్‌ను అందుకోగలదు. ఈ కారులో 3-లీటర్ 6-సిలిండర్ ట్విన్-టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 558 PS శక్తిని, 650 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అటాచ్ చేశారు.
5. లంబోర్ఘిని ఉరస్ SE
వేగం: కేవలం 3.4 సెకన్లలో 0-100 కిమీ/గం.
0-200 కిమీ/గం: 11.2 సె.
గరిష్ట వేగం: 312 కిమీ/గం.
ఈ కారులో హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఉంది. ఇది 4-లీటర్ V8 టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. ఇది 620 PS శక్తిని, 800 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. అంతేకాకుండా.. ఇది ఎలక్ట్రిక్ మోటారు, 25.9 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది.