Site icon NTV Telugu

Consumption of Alcohol: అత్యధికంగా మద్యం వినియోగం ఉన్న దేశాలు ఇవే.. భారత్ స్థానం ఎంతంటే?

Alchol

Alchol

సంతోషమైన, భాదొచ్చిన మందు మస్ట్ అంటున్నారు కొందరు వ్యక్తులు. చుక్క పడనిదే పూట గడవని మద్యం ప్రియులు కూడా ఉన్నారు. ఇటీవలి కాలంలో మద్యం వినియోగం పెరిగిపోయింది. పండుగలకు, శుభకార్యాలకు తాగి తలకు పోసుకుంటున్నారంటే నమ్మండి. అత్యధిక మద్యం వినియోగంతో ప్రభుత్వాలకు కాసుల వర్షం కురిసి ఖజానా ఘళ్లు మంటోంది. అయితే కానీ అధిక వినియోగం ఆరోగ్య సమస్యలు, సామాజిక అంతరాయాలకు కారణమవుతుంది. అయితే భారత్ వంటి దేశాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా మద్యం వినియోగించే దేశాలు ఉన్నాయి. మరి వాటిల్లో భారత్ ఎన్నో స్థానంలో ఉందో ఇప్పుడు చూద్దాం.

Also Read:Haris Rauf ICC Ban: పాకిస్థాన్ ప్లేయర్ హరిస్ రవూఫ్‌కు ఐసీసీ షాక్.. సూర్యకు కూడా! ఎందుకో తెలుసా..

అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వద్ద అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, తలసరి ఆల్కహాల్ వినియోగం కుక్ దీవులలో అత్యధికంగా ఉంది, తరువాత లాట్వియా, చెకియా, లిథువేనియా, ఆస్ట్రియా ఉన్నాయి. టాప్ 10లో ఉన్న ఇతర దేశాలు ఆంటిగ్వా, బార్బుడా, ఎస్టోనియా, ఫ్రాన్స్, బల్గేరియా, స్లోవేనియా. 189 దేశాల జాబితాలో భారతదేశం 111వ స్థానంలో ఉంది.

Also Read:Bandla Ganesh : నన్ను ఇబ్బంది పెట్టొద్దు.. బండ్ల గణేష్ షాకింగ్ పోస్ట్

అధిక మద్యపానం లివర్ సమస్యలు, క్యాన్సర్, రోడ్డు ప్రమాదాలకు దారితీస్తుంది. WHO ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా మద్యపానం వల్ల 3 మిలియన్ల మరణాలు సంవత్సరానికి జరుగుతున్నాయి. లాట్వియా వంటి దేశాల్లో బింజ్ డ్రింకింగ్ రేటు బాగా ఉంది, ఇది ఆరోగ్య వ్యవస్థపై భారం. అమెరికాలో 9.5 లీటర్లు వినియోగం ఉన్నప్పటికీ, 10.5% మంది ఆల్కహాల్ యూజ్ డిసార్డర్‌తో బాధపడుతున్నారు. అత్యధిక మద్యపానం చేసే దేశాలు ఎక్కువగా యూరప్‌లో ఉన్నాయి. ప్రభుత్వాలు ట్యాక్స్‌లు, అవేర్‌నెస్ కార్యక్రమాలు ద్వారా నియంత్రించాల్సిన అవసరం ఉందంటున్నారు కొందరు వ్యక్తులు.

Exit mobile version