Site icon NTV Telugu

Padmavati Express: పద్మావతి ఎక్స్ ప్రెస్ లో చోరి.. 40 గ్రాముల బంగారం అపహరణ

Padmavathi Express

Padmavathi Express

పద్మావతి ఎక్స్ ప్రెస్ లో భారీ చోరీ చోటుచేసుకుంది. రైళ్లో ప్రయాణిస్తున్న దొంగలు రెచ్చిపోయారు. మూడు బోగీల్లో చోరీకి పాల్పడ్డారు. ముగ్గురు మహిళల నుంచి 40 గ్రాముల బంగారం ఆపహరించారు. బంగారం అపహరణకు గురవడంతో లబోదిబోమంటున్నారు బాధితులు. కావలి – శ్రీ వెంకటేశ్వర పాలెం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలులో ప్రయాణం చేస్తూనే చోరికి పాల్పడి పరారయ్యారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్టున్నట్లు పోలీసులు తెలిపారు.

Exit mobile version