యమహా బైకులకు యమ డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే.. ఒకప్పుడు యూత్ ఎక్కువగా ఈ బైకులను వాడేవారు.. ఇప్పటికి ఆ క్రేజ్ తగ్గలేదు.. కొన్నేళ్ల క్రితం ఈ కంపెనీ బైకులకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉండేది. కొన్ని కారణాల వల్ల ఈ బండ్ల సేల్స్ పూర్తిగా ఆగిపోయింది.. దాంతో మార్కెట్ లో ఈ బైకులు కనుమరుగయ్యాయి.. ఇటీవల అదిరిపోయే ఫీచర్స్ తో కొత్త బైకులను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు… తాజాగా మరో బైకు యువతను ఆకట్టుకుంటుంది.. ఆ బైకు ఫీచర్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
యమహా ఆర్ఎక్స్ 100 ప్రత్యేక మోడిఫికేషన్ తో చేసుకొని మార్కెట్లోకి రావడానికి సిద్ధమైంది.. 98cc, టూ స్ట్రోక్ ఇంజన్ చాసిస్ కలిగి అధునాతనమైన హ్యాండ్లింగ్ త్రిల్లింగ్ రైడింగ్ అందిస్తుంది. పాత బైకును రీ మోడల్ చేసి మార్కెట్ లోకి తీసుకొని రాబోతున్నారు..రెండు చక్రాలపై డిస్క్ బ్రేకులు, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టం భద్రతా ఫీచర్లు ఉన్నాయి. లైట్లు,బైకు లుకింగ్ పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి.. రెండు చక్రాలపై డిస్క్ బ్రేకులు, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టం భద్రతా ఫీచర్లు ఉన్నాయి.. ప్రస్తుత ట్రాఫిక్ పరిస్థితులను బట్టి రైడింగ్ అనుభూతిని కలిగిస్తుంది..
ఈ కంపెనీ బైకులు ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ లో ఎన్నో ప్రకంపణలు సృష్టించాయి.. అంతేకాకుండా హ్యాండ్లింగ్ పై దృష్టి సారించే ఆధునిక ఇంజన్ కలిగినటువంటి ఈ బైక్ ఆకర్షణ ఏమైనా రైడ్ అనుభవాన్ని ఇస్తుంది.. ఇకపోతే ఈ యొక్క బైక్ 125 సిసి, 150 సిసి విభాగాల్లో మార్కెట్లోకి రావడానికి రెడీగా ఉంది.. వీటితో ఇంకా అనేక అద్భుతమైన ఫీచర్స్ ను కలిగి ఉంది.. ఇక మున్ముందు ఇంకాస్త మెరుగైన ఫీచర్స్ తో సరికొత్త లుక్ తో కొత్త బైకులను లాంచ్ చెయ్యనున్నట్లు సమాచారం.. ఈ కొత్త బైకు ధర, పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి..