NTV Telugu Site icon

Viral Video : దేవుడా.. మరో వింతే.. కారులా మారిన మనిషి.. వీడియో వైరల్..

Man Car

Man Car

సోషల్ మీడియా అనేది ఒక వింత ప్రపంచం ఇక్కడ ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి.. ఇక్కడ క్రేజ్ తెచ్చుకోవాలని కొందరు చేసే ప్రయత్నాలు ఔరా అనిపిస్తాయి.. ఆశ్చర్యపర్చే అద్భుతాలు.. అతిభయం కరమైన దృశ్యాలు ఇలా ఎన్నో విశేషాలను మనకు చూపుతుంది.. అలాంటి ఓ అద్భుతమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ఈ వీడియోలో ఒక మనిషి తనకు తానుగా ఓ కారు రూపంలోకి మారిపోవడానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చేతులకు, కాళ్లకు చక్రాలు ఉన్న రోబోటిక్ టినీ కారుగా మారిపోవడం ఈ వీడియోలో కనిపిస్తుంది. రద్దీగా ఉన్న రోడ్డుపై కారు విడి భాగాలతో నిలబడి ఉన్న ఆ మనిషి.. క్షణాల్లో నేలపై కూర్చొని కారు రూపంలోకి మారిపోయాడు. దీంతో దారిలో పోతున్న జనం అతని చర్యలు చూసి ఆశ్చర్యపోయారు… ఈ వీడియో ఏదో మ్యాజిక్ లాగా ఉందని చూస్తూ ఉండిపోయారు..

టెక్నాలజీ పెరుగుతున్న రోజుల్లో మనుషులు చేస్తున్న ఒక మాయ.. ఎంటర్ టైన్ మెంట్ రంగంలో టెక్నాలజీ ఎంతగా అభివృద్ది చెందిందో ఇది చెపుతోంది. వాస్తవానికి ఇది ఒక బొమ్మ.. దీనిని కూల్ టోయ్ అంటారు. ఇలాంటి బొమ్మలతో ఆధునిక టెక్నాలజీ వినియోగించి హాలీవుడ్ లో ఓ సినిమా కూడా తీశారు.. ఈ వ్యక్తి చేసిన యాక్షన్ అన్ని ట్రాన్స్ ఫార్మర్ సినిమాకు ట్రైలర్ అని అంటున్నారు. ఏది ఏమైనా..ఆధునిక టెక్నాలజీతో ఆ వ్యక్తి అందరిని ఎంటర్ టైన్ చేశాడు.. మొత్తానికి వీడియో తెగ వైరల్ అవుతుంది.. ఓ లుక్ వేసుకోండి..