హీరో జీవా, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ప్రముఖ పాత్రలో నటిస్తున్న ఫాంటసీ హారర్ థ్రిల్లర్ మూవీ ‘అగత్యా’. ఈ చిత్రాన్ని ప్రముఖ గీత రచయిత పా.విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, వామిండియా బ్యానర్స్ పై ఇషారి కే గణేష్, అనీష్ అర్జున్ దేవ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో గ్రామీణ నేపథ్యంతో పాటు మంచి థ్రిల్లింగ్ కాన్సెప్ట్ ఉన్నట్లు యూనిట్ చెబుతోంది. ఇందులో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో ఎడ్వర్డ్ సోన్నెన్‌బ్లిక్, యోగి బాబు, వీటీవీ గణేష్, రెడిన్ కింగ్స్లీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టార్ కంపోజర్ యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. పాటలన్నీ చార్ట్ బస్టర్ అయ్యాయి.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ని విడుదలైంది. ‘సుమారు 120 సంవత్సరాల క్రితం బ్రతికిన ఆత్మలని మీరు ఇప్పుడు కలుసుకోబోతున్నారు’ అనే వాయిస్ తో ట్రైలర్ మొదలైంది. సినిమా కాన్సెప్ట్, హారర్ ఫాంటసీ ఎలిమెంట్స్, బ్యాక్ డ్రాప్ నెవర్ బిఫోర్ ఎక్సపీరియన్స్ అందించాయి. జీవా, అర్జున్ సర్జా ఎక్స్ ట్రార్డినరీ ఫెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. రాశీ ఖన్నా పాత్ర కూడా ఆకట్టుకునే ఉంది. ట్రైలర్ తో అంచనాలు పెంచిన ‘అగత్యా’ ఫిబ్రవరి 28, 2025న తమిళం, తెలుగు, హిందీ భాషలలో పాన్ ఇండియా రిలీజ్ కానుంది.