NTV Telugu Site icon

Devara : దేవర కోసం రంగంలోకి దిగిన ఆ స్టార్ కొరియోగ్రాఫర్‌..

Ntr (2)

Ntr (2)

Devara : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర షూటింగ్ లో బిజీ గా వున్నాడు.మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఏకంగా రెండు పార్ట్స్ గా రూపొందుతుంది.మొదటి పార్ట్ ను మేకర్స్ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమాకి సంబంధించి మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ ,గ్లింప్సె సినిమాపై బాగా అంచనాలు పెంచేసాయి.ఇదిలా ఉంటే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేసారు.”ఫియర్ సాంగ్” పేరుతో రిలీజ్ అయిన ఈ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది..

Read Also :Kirrak Boys Vs Khiladi Girls :అనసూయ షోలో ఈ విప్పుకోవడాలు ఏంట్రా?

రీసెంట్ గా గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ తాజాగా ఫ్యామిలీతో కలిసి థాయిలాండ్ వెళ్లారు.అక్కడ దేవర రొమాంటిక్ సాంగ్ ను షూట్ చేస్తున్నారు.ఎన్టీఆర్ ఆ సాంగ్ షూట్ లో పాల్గొంటూనే ఫ్యామిలీతో థాయిలాండ్ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.ఇదిలా ఉంటే ఈ రొమాంటిక్ సాంగ్ కు స్టార్ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిన్ కొరియోగ్రఫీ అందించనున్నారు.పఠాన్ ,వార్ ,ఫైటర్ వంటి సినిమాలలో బాస్కో మార్టిన్ కంపోజ్ చేసిన డాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా ఎన్టీఆర్ మూవీకి డాన్స్ కంపోజ్ చేస్తుండటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు .తాజాగా ఈ స్టార్ కొరియోగ్రాఫర్  ఎన్టీఆర్ తో దిగిన ఫోటోలని తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసారు.ఎన్టీఆర్ ఎంతో టాలెంటెడ్ పర్సన్ అని అతనితో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉందని మార్టిన్ తెలిపారు.

Show comments