NTV Telugu Site icon

AP Violence: మరణాలకు దారితీసే స్థాయిలో రాళ్ల దాడులు.. కౌంటింగ్ లోపు మరో సిట్ నివేదిక

New Project (35)

New Project (35)

అల్లర్లపై డీజీపీకి సిట్ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. సిట్ ఏపీ అల్లర్లపై మరో నివేదిక ఇవ్వనుంది. ఇవాళ ఇచ్చిన ప్రాథమిక నివేదికలోనే కీలక సిఫార్సులు, గుర్తించిన అంశాలు పొందుపర్చింది. ప్రస్తుతానికి 2 రోజుల విచారణ ముగిసినప్పటికీ కేసులపై పరివేక్షణ ఇకపై కూడా చేయనునుంది. కేసుల పరివేక్షణపై పురోగతితో మరో రిపోర్ట్ సిద్దం చేయనుంది. అల్లర్లను చాలా తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తున్నట్లు సిట్ నివేదికలో పేర్కొంది. మరణాలకు దారి తీసే స్థాయిలో రాల్ల దాడికి తెగబడ్డారని తెలిపింది. రెండు గ్రూపులుగా విడిపోయి దాడులకు ర్యాలీలు, కర్రలతో తెగబడ్డారని స్పష్టం చేసింది. అల్లర్లపై నమోదైన కేసుల దర్యాప్తుపై నిరంతరం పరివేక్షణ చేయనున్న సిట్ పురోగతి రిపోర్ట్ కౌంటింగ్ లోపు డీజీపీకి ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే నమోదు చేసిన కేసుల్లో అదనపు సెక్షన్లు జోడించటానికి కోర్టుల్లో మెమో దాఖలు చేయాలని విచారణ అధికారులకు ఆదేశించారు. సీసీ టీవీ ఫుటేజ్, వీడియో ఫుటేజ్ లను డిజిటల్ సాక్ష్యాలుగా సేకరించాలని సూచించారు. అరెస్టులు చేయటంతో పాటు తర్వాత చార్జీ షీట్లు దాఖలు చేయాలని ఆదేశం అనేక లోపాలు గుర్తించినట్లు దర్యాప్తులో తెలినట్లు సిట్ బృందం పేర్కొంది. నిందితుల అరెస్ట్ కు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయనున్నారు.

READ MORE: Alia Bhatt Mother: ఇల్లీగల్ డ్రగ్స్ స్కామ్‌లో అలియా భట్ తల్లి?

అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్లకు సంబంధించి ప్రాథమిక నివేదిక సిట్ డీజీపీకి అందజేసింది. రెండు గ్రూపులు విడిపోయిన టీడీపీ, వ్తెసీపీ కార్యకర్తలు పదున్తెన రాళ్లతో దాడులు చేసుకున్నట్లు సిట్ గుర్తించింది. అల్లర్లకు సంబంధించి ఇప్పటి వరకు ఏడు కేసులు నమోదైనట్లు పేర్కొంది. 728 మంది అల్లర్లలో పాల్గొన్నట్లు గుర్తించింది. ఇప్పటి వరకు రాళ్లదాడిలో పాల్గొన్న 396 మందిని పోలీసులు గుర్తించినట్లు తెలిపింది. అల్లర్లలో పాల్గొన్న మరో 332 మందిని గుర్తించాల్సి ఉంది. ఇప్పటి వరకు టీడీపీ, వ్తెసీపీకి చెందిన 91 మందిని అరెస్ట్ చేశారు. అజ్ఞాతంలో ఉన్న 634 మందిని అరెస్ట్ చేయడానికి పోలీసు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. మరో 3 ముగ్గురికి 41ఏ నోటీసులు జారీ చేశారు. కాగా.. తాడిపత్రిలో నమోద్తెన కేసులలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన కుమారుడు హర్ష, అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ కుమారుడు ఎమ్మెల్యే అభ్యర్థి అస్మిత్ రెడ్డి ఉన్నారు.