The Sabarmati Report : గోద్రా ఘటనపై ‘ది సబర్మతి రిపోర్ట్’.. ఎలా ఉందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Sabarmati Report : బాలీవుడ్ నటుడు, 12th ఫెయిల్ మూవీ ఫేమ్ విక్రాంత్ మస్సే.. ప్రస్తుతం ది సబర్మతీ రిపోర్ట్ అనే సినిమాతో వస్తున్న విషయం తెలిసిందే. రంజన్ చందేల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా, రిద్ది డోగ్రా హీరోయిన్లు గా నటిస్తున్నారు. గోద్రా ఘటన ఆధారంగా రూపొందుతున్న ఆ సినిమాను బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ చాలా గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే మూవీని నవంబర్ 15న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే సినిమా ప్రమోషన్లు కూడా మొదలు పెట్టేశారు. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. 2002 ఫిబ్రవరి 27తేదీన జరిగిన గోద్రా ఘటన చుట్టూ సినిమా అంతా తిరుగుతున్నట్లు ఓ క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. డేరింగ్ జర్నలిస్ట్ గా విక్రాంత్ నటిస్తున్నట్లు, రాశీ ఖన్నా తోటి రిపోర్టర్ గా, సీనియర్ యాంకర్ గా రిద్ధి యాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు టీజర్ కు వచ్చిన స్పందనతో ట్రైలర్ ను రిలీజ్ చేసింది యూనిట్.
Read Also : Gold Price Today: గోల్డ్ లవర్స్‌కు గోల్డెన్ న్యూస్.. ఊహించని రీతిలో తగ్గిన బంగారం ధర! అంతకుమించి వెండి
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ఈ ట్రైలర్ లో విక్రాంత్ మెస్సే సబర్మతి ఎక్స్ ప్రెస్ పై జరిగిన దాడి వెనుక నిజాలను వెలికి తీసేందుకు పోరాడుతున్నట్లు చూపించారు. ఆంగ్ల కథనాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా సినిమాలో హీరో పోరాడుతూ కనిపిస్తున్నారు. పోలీసులు తీసుకెళ్తుంటే పవర్ ఫుల్ డైలాగ్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు హీరో విక్రాంత్. ట్రైలర్ చివర్లో రైలుపై దాడి జరుగుతున్నట్లు, ట్రైన్ తగలబడుతున్నట్లు చూపించే సన్నివేశాలు.. ఒక్కసారిగా సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. సినిమాలో క్యాస్టింగ్ అంతా పవర్ ఫుల్ గా నటించినట్లు ట్రైలర్ ద్వారా స్పష్టం అవుతుంది. విక్రాంత్ మస్సే, రిద్ధి డోగ్రా అదరగొట్టేశారు. 12th ఫెయిల్, ది సబర్మతి రిపోర్ట్ చిత్రాల్లో విక్రాంత్ పోషించిన పాత్రల మధ్య చాలా పోలికలు ఉన్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రెండు పాత్రల్లో విక్రాంత్ ఒదిగిపోయారని అంటున్నారు. కానీ రెండు రోల్స్ సెపరేట్ జోనర్ అని రీసెంట్ గా ఆయన క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో ఢిల్లీ బ్యూటీ రాశీ ఖన్నా యాక్టింగ్ కూడా అదిరిపోయిందని సినీ ప్రియులు చెబుతున్నారు. ఓవరాల్ గా ట్రైలర్ బాగుందని రివ్యూ ఇస్తున్నారు. సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అవుతున్నాయని అంటున్నారు.
Read Also : Gold Price Today: గోల్డ్ లవర్స్‌కు గోల్డెన్ న్యూస్.. ఊహించని రీతిలో తగ్గిన బంగారం ధర! అంతకుమించి వెండి
VIKRANT MASSEY: 'THE SABARMATI REPORT' TRAILER OUT NOW… 15 NOV RELEASE… Ahead of its theatrical release on 15 Nov 2024, the makers of #TheSabarmatiReport unveil the hard-hitting trailer that is sure to spark conversations.
The film – headlined by #VikrantMassey – also… pic.twitter.com/dnMgs8sAin
— taran adarsh (@taran_adarsh) November 6, 2024
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!