The RajaSaab Runtime: ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇండియన్ సినిమా హిస్టరీలో ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న నటుడు ప్రభాస్. తనదైన శైలిలో సినిమాలు తీసుకుంటూ టాలీవుడ్‌లో దూసుకుపోతున్న డైరెక్టర్ మారుతీ. ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న సినిమా.. ‘ది రాజాసాబ్’.
READ ALSO: Localbody Elections: ముగిసిన రెండో విడత నామినేషన్ల గడువు..
ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తాజాగా సినిమా రన్‌టైమ్‌పై ఒక స్పష్టత వచ్చింది. ‘ది రాజా సాబ్’కు సంబంధించి అమెరికాలో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అయితే టికెట్ బుకింగ్ వెబ్‌సైట్‌లో ఉంచిన వివరాల ప్రకారం.. ఈ సినిమా రన్‌టైమ్ 3 గంటలా 14 నిమిషాలుగా కనిపిస్తోంది. వాస్తవానికి ఇటీవల కాలంలో విడుదలైన ప్రభాస్ సినిమాల రన్‌టైమ్ దాదాపు అన్ని కూడా 3గంటలపైనే ఉన్నాయి. అయితే డైరెక్టర్ మారుతీ చిత్రాలు మాత్రం తక్కువ నిడివితో వచ్చాయి. తొలిసారి ఈ ఇద్దరి కాంబోలో, అది కూడా హారర్ కామెడీ నేపథ్యంలో సినిమా వస్తుండటంతో ఈ చిత్రంపై ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు, సినిమా ప్రేమికులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. మేకర్స్ మొదట ఈ సినిమాను డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేశారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా జనవరి 9కు వాయిదా వేశారు. అయితే ఈ సినిమా ‘ఐమాక్స్ వెర్షన్‌తో సహా అన్ని ఫార్మాట్‌లలో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుందని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రాన్ని విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ కథానాయికలుగా కనిపించనున్నారు. ఒక కీలక పాత్రలో సంజయ్‌దత్ నటిస్తున్నారు.
READ ALSO: Glenn Maxwell: ఐపీఎల్ నుంచి రిటైర్ అయిన విధ్వంసకర బ్యాట్స్‌మెన్ ..
