Andrapradesh : రైతును కోటీశ్వరున్ని చేసిన వర్షం.. కోట్లు విలువైన వజ్రం లభ్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ కర్నూల్ జిల్లాలో వర్షం పడితే జనాలు వజ్రాల వేటను కొనసాగిస్తారు.. ఆరోజుల్లో రాజులు అక్కడ నివసించారని వారి వజ్ర వైడుర్యాలు అక్కడ భూమిలో ఉండి పోయాయని జనాలు భావిస్తున్నారు.. అందుకే కర్నూల్ జిల్లాలో వర్షం పడితే చాలు జనాలు పొలాల్లో తిష్ట వేస్తారు.. గతంలో చాలా మందికి అరుదైన వజ్రాలు దొరికాయి.. అయితే తాజాగా కురిసిన వర్షం రైతును కోటీశ్వరున్ని చేసింది.. అతని పొలంలో అత్యంత ఖరీదైన వజ్రం దొరికింది.. అతని దిశ మారింది..
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్‌పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం, కర్నూలు జిల్లాల ప్రజలు రెండు జిల్లాల సరి హద్దుల్లో విలువైన వజ్రాలు దాగున్నాయని చెబుతున్నారు. వర్షం వస్తే ఇక్కడి నేలలపై పంటలు పండుతాయో లేదోగానీ.. వజ్రాలు మాత్రం పండుతాయని నమ్మకం. అందుకే వాన పడినప్పుడల్లా ఇక్కడి ప్రజలు వజ్రాన్వేషణ లో ఉంటారు.. తాజాగా కురిసిన వర్షం జనాల్లో కొత్త ఊపును తెచ్చింది.. మద్దికెర ప్రాంతంలో వజ్రాల వేట తరచూ మనం వినేదే. ఆ నేలల్లో వజ్రాల వేట కోసం వేరేవేరే జిల్లాల నుంచి జనం వస్తుంటారు. విలువైన రాయిలా అనిపిస్తే చాలా పరుగున వజ్రాల వ్యాపారుల దగ్గరకు వెళ్తారు. కొనేందుకు అక్కడ వ్యాపారుల మధ్య కూడా పోటీ ఉంటుంది. రైతులు కూడా ఇక వ్యాపారులకు గట్టి పోటీని ఇస్తూ వజ్రాలను అన్వేషిస్తున్నారు..
అలాంటి మద్దెకర మండలంలోని బసినేపల్లి లో ఓ రైతుకు వజ్రం కళ్లబడింది. ఆ వజ్రాన్ని అక్కడే అమ్మకానికి పెట్టాడు. అక్కడే వేచి చూస్తున్న వ్యాపారికి అమ్మకానికి పెడితే.. దాన్ని రూ. 2 కోట్లు పలికినట్లుగా ప్రచారం సాగుతోంది.. ఆ విషయం అందరికి తెలియడంతో జనాలు పొలాల్లో వాలిపోయారు.. వర్షాలు పడ్డప్పడు వెదికితే వజ్రాలు దొరుకుతాయని.. స్థానికులు ఏటా ఈ సమయంలో వెదుకులాడుతుంటారు. తమకు కూడా వజ్రం దొరకకపోతుందా అనే ఆశతో వెతుతుంటారు.. ఇక అనంతపూర్ లో బంగారు నిక్షేపాలు ఉన్నాయని జనాలు అంటున్నారు.. అక్కడ కూడా వర్షం పడితే జనాలు పొలాల్లో వాలిపోతున్నారు..
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?