గుంటూరు జిల్లా తెనాలి బాలాజీరావు పేటకు చెందిన వీధి వ్యాపారి గణేష్ కు రాష్ట్రపతి ఆహ్వానం అందింది …పాని పూరీ కార్నర్ నడుపుతున్న మెఘావత్ చిరంజీవికి న్యూఢిల్లీలో ఈ నెల 15న నిర్వహించనున్న స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనాలని రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము నుంచి ఆహ్వానం అందింది. ఆహ్వాన ప్రతిని తపాలా కార్యాలయ అధికారులు శనివారం ఆయనకు అందజేశారు. చిరంజీవి బాలాజీరావుపేట రైల్వేస్టేషన్ వీధిలో పానీపూరి దుకాణం నడుపుతుంటారు.
Hyderabad Crime: పోలీసులను చూసి పరుగులు పెట్టాడు.. ప్రాణాలు వదిలాడు..
వ్యాపార వృద్ధికి జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ కింద తెనాలి పురపాలక పట్టణ పేద రిక నిర్మూలన విభాగం 2021లో రూ.10 వేలు, 2022లో రూ.20 వేలు, 2023లో రూ. 50 వేల చొప్పున రుణాలిచ్చింది. బకాయిలను సకాలంలో చెల్లించడంతోపాటు డిజిటల్ రూపంలో నగదు లావాదేవీలు నిర్వహించినందుకు ప్రోత్సాహకంగా ఈ ఆహ్వానం అందినట్లు అధికారులు చెప్పారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. మెప్మా సహకారం వల్ల అధిక వడ్డీ లకు అప్పులు తెచ్చుకోవాల్సిన అవసరం తప్పిందన్నారు. అరుదైన ఆహ్వానం తెనాలివాసిగా తనకు రావడం ఆనందంగా ఉందని చెప్పారు.
Nagarjuna Sagar: టీజీ ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఎంజీబీఎస్ నుంచి నేరుగా డీలక్స్ బస్సులు..