NTV Telugu Site icon

Prabhas : ‘బుజ్జి’ పేరు చిన్నగా వున్నా.. మా సినిమాకి ఎంతో స్పెషల్..

Prabhas

Prabhas

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD “..ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించారు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.మేకర్స్ ఈ చిత్రాన్ని జూన్ 27 న ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.దీనితో ఇప్పటి నుంచే వరుసగా ప్రమోషన్స్ మొదలు పెట్టారు.ఈ సినిమా నుంచి వరుస క్యారెక్టర్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై భారీగా హైప్ ను పెంచుతున్నారు.ఈ సినిమాలో ప్రభాస్ భైరవ అనే పాత్ర చేస్తున్నాడు.అలాగే ఈ సినిమాలో కమల్ ,అమితాబ్ వంటి దిగ్గజ నటులు నటిస్తున్నారు..తాజాగా ఈ సినిమా నుంచి బుజ్జి అనే మరో క్యారెక్టర్ మేకర్స్ రివీల్ చేసారు.

Read Also :Kalki 2898 AD : బుజ్జి ఈవెంట్ కి పర్మిషన్స్ టెన్షన్.. చివరి నిముషంలో..?

బుజ్జి అంటే ఈ సినిమాలో ఓ రోబోటిక్ కార్.అలాగే ప్రభాస్ కు క్లోజ్ ఫ్రెండ్ కూడా ..దీనితో బుజ్జిని ప్రేక్షకులకు మేకర్స్ ఎంతో గ్రాండ్ గా పరిచయం చేసారు. మే 22 బుధవారం రామోజీ ఫిల్మ్ సిటీలో బుజ్జి గ్రాండ్ ఎంట్రీ ఏర్పాటు చేసారు.భారీ హైప్ తో భైరవ బుజ్జితో మాస్ ఎంట్రీ ఇచ్చాడు.ప్రభాస్ ఎంట్రీ చూసి ఫ్యాన్స్ ఆశ్చర్య పోయారు.అనంతరం బుజ్జిని పరిచయం చేసిన ప్రభాస్ బుజ్జి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.ఈ సినిమాలో బుజ్జి పేరు చిన్నగా అనిపించినా మాకు ఎంతో స్పెషల్ .ఇంజనీరింగ్ చేయకుండానే ఇంజినీర్లుగా మారి ఈ కారును తయారు చేసాము ఆనంద్ మహేంద్ర గారు అలాగే ఆయన టీం సహకారంతోనే ఇది జరిగింది అని ప్రభాస్ తెలిపారు.

Show comments