టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..’కలర్ ఫోటో’ సినిమా తో సుహాస్ హీరోగా తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.ఆ తరువాత వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీ గా వున్నాడు. ప్రస్తుతం సుహాస్ హీరో గా నటిస్తున్న తాజా చిత్రం అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్.దుశ్యంత్ కటికినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టీజర్,ఫస్ట్ సింగిల్ ను లాంఛ్ చేయగా.. నెట్టింట హల్ చల్ చేస్తూ సినిమాపై మరింత ఆసక్తి పెంచేసాయి.. ఇదిలా వుంటే.. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ సెకండ్ సింగిల్ ప్రోమో విడుదల చేశారు.ఈ మూవీ నుంచి మా ఊరు అంబాజీపేట సాంగ్ ప్రోమోను చిత్రబృందం విడుదల చేసింది.
రారోయ్ మావురి సిత్రాన్ని సూద్దాం. ఇటు రారోయ్ ఈ బతుకు పాటను విందాం. ఈ సన్నాయి నొక్కుల్లోనా ఊరించే సంగతులేన్నో ఉన్నాయి. ఈ డప్పుల చప్పుడు లోనా ఊగించే గుండె లయాలు ఉన్నాయి అంటూ ఈ ప్రోమో సాగింది. ఇక మ్యూజిక్ బ్యాండ్‌లను నమ్ముకుని బతుకుతున్న కార్మికుల కథతో ఈ పాట ఎమోషనల్‌గా సాగింది. ఈ సాంగ్‌ను కాలభైరవ పాడగా.. రెహమాన్ లిరిక్స్ అందించాడు. ఈ సినిమాకు శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించాడు. పూర్తి సాంగ్‌ను కొత్త సంవత్సరం కానుకగా జనవరి 02న విడుదల చేయనున్నారు.ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2, మహాయణ మోషన్ పిక్చర్స్ మరియు ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తం గా తెరకెక్కిస్తున్నాయి. సుహాస్ మరోవైపు ఆనందరావ్ అడ్వంచర్స్ అనే సినిమా లో కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి రామ్ పసుపులేటి దర్శకత్వం వహిస్తున్నాడు. క్లాస్ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
