Nanded Crime: భారత ఆర్మీ సైనికులు నేడు సరిహద్దులో దేశాన్ని కాపాడుతున్నారు. దేశం వంక చూస్తూ ఉగ్రవాద చర్యలకు పాల్పడే వారికి సైనికులు గుణపాఠం చెబుతారు. భారత సైనికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని కాపాడుతున్నారు. ఈ జవాన్లు విధి నిర్వహణలో ఎలాంటి సంక్షోభం వచ్చినా వెనక్కి తగ్గరు. వారు రెండు చేతులతో ఉగ్రవాదులతో పోరాడుతున్నారు. ఒక్కోసారి వీరోచితమైన పోరాటంలో వారు మరణిస్తారు.. కానీ దేశానికి కొన ఊపిరి పోయేంత వరకు రక్షణగా నిలబడుతారు. భారత సైన్యంలోని అలాంటి సైనికులకు ప్రతి ఒక్కరూ కచ్చితంగా కృతజ్ఞతలు చెప్పాల్సిందే.
Read Also:Meher Ramesh : టాలీవుడ్ టాప్ బ్యానర్ నుంచి ఆఫర్ అందుకున్న మెహర్ రమేష్..?
ఇదిలా ఉండగా సైనికుల ప్రతిష్టను దిగజార్చే షాకింగ్ సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ ఆర్మీ జవాన్ తన సొంత భార్య, బిడ్డను హత్య చేశాడు. ఈ సంఘటన దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. ఈ ఘటనతో అక్కడ సంచలనం నెలకొంది. నిందితుడు తన భార్యను, నాలుగేళ్ల కుమార్తెను ఎందుకు చంపాడు? అనే ప్రశ్న అక్కడి జనాల్లో తలెత్తుతోంది. ఆ జవాన్ భార్య నిండు గర్భిణి. ఆమెను, తన నాలుగేళ్ల కుమార్తెను నిద్రిస్తున్న సమయంలో గొంతు కోసి హత్య చేశాడు. ఈ సంచలన ఘటన నాందేడ్ జిల్లా కంధర్ తాలూకా బోరి గ్రామంలో చోటుచేసుకుంది.
Read Also:Ben Stokes Century: ప్రపంచంలో రెండో క్రికెటర్‌గా బెన్ స్టోక్స్.. ఒక్క రన్‌తో ధోనీ రికార్డు మిస్!
వారితో పాటు తన భార్య కడుపులో ఉన్న అభం శుభం తెలియని ముక్కు పచ్చలారని శిశువును కూడా హత్య చేశాడు. హత్యానంతరం నిందితుడు ఏక్‌నాథ్ జయభయే స్వయంగా మాలకోలి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తానే స్వయంగా హత్య చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. ఈ ఘటనతో కోపోద్రిక్తులైన గ్రామస్తులు మాలకోలి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. మాలకోలి పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై కేసు నమోదైంది. కాగా, ప్లాట్‌ను కొనుగోలు చేసే విషయంలో తలెత్తిన వివాదమే ఈ హత్యలకు కారణమని తెలుస్తోంది.
